బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి సినిమా ఊహకందని సక్సెస్ ను సొంతం చేసుకున్న పంజా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ ఇండియా రికార్డులను తిరగరాసి సంచలనం సృష్టించింది. అలాంటి అల్టిమేట్ హిట్ సొంతం అవ్వడం చాలా తక్కువ మందికే సాధ్యం అని చెప్పాలి. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ నటించిన రెండో సినిమా కొండ పొలం బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కి సిద్ధం అవ్వగా….
సినిమా ఎంతవరకు బిజినెస్ ను సొంతం చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత సాధిస్తే క్లీన్ హిట్ అవుతుంది లాంటి విశేషాలు ఆసక్తిని రేపగా…. 85 కోట్ల బ్లాక్ బస్టర్ విజయం తర్వాత ఇది చాలా అంటే చాలా తక్కువ బిజినెస్ అనే చెప్పాలి. ఈ సినిమా మొత్తం మీద…
నైజాంలో 2.5 కోట్ల బిజినెస్ ను, సీడెడ్ లో 1.3 కోట్ల బిజినెస్ ను టోటల్ ఆంధ్రలో 3 కోట్ల బిజినెస్ ను అందుకుంది. దాంతో తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 6.8 కోట్ల బిజినెస్ ను అందుకోగా మిగిలిన అన్ని చోట్లా కలిపి మరో 70 లక్షల దాకా బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకుందని ట్రేడ్ సమాచారం.
దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు 7.5 కోట్ల రేంజ్ లో ఉందని చెప్పాలి. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు క్లీన్ హిట్ అవ్వాలి అంటే మొత్తం మీద 8 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా సొంతం చేసుకోవాల్సిన అవసరమెంతైనా ఉంది. ఉప్పెన సాధించిన ఊహకందని విజయం తర్వాత వస్తున్న కొండపొలం…
కాన్సెప్ట్ కానీ జానర్ కానీ రెగ్యులర్ మూవీస్ లా కాదు కాబట్టి ఈ సినిమా కి తక్కువ బిజినెస్ జరిగింది అని చెప్పాలి. మరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంతవరకు ఈ బిజినెస్ ను వెనక్కి రాబట్టి క్లీన్ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఓపెనింగ్స్ ని అందుకుంటుంది అన్నది కూడా ఆసక్తికరం అని చెప్పొచ్చు.