Home గాసిప్స్ 3 ఇయర్స్ ఓల్డ్ మూవీ…1.2 కోట్ల బడ్జెట్…టోటల్ బిజినెస్ తెలిస్తే షాక్!

3 ఇయర్స్ ఓల్డ్ మూవీ…1.2 కోట్ల బడ్జెట్…టోటల్ బిజినెస్ తెలిస్తే షాక్!

0

ఇది వరకటిలా సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ లు, డైలీ కలెక్షన్స్ రిపోర్ట్స్ లాంటివి మరి కొన్ని నెలల పాటు ఉండే అవకాశం చాలా తక్కువే అని చెప్పాలి. ఈ కరోనా ఎఫెక్ట్ వలన ఈ ఏడాది కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయో లేదో అన్న క్లారిటీ కూడా లేకుండా పోగా… డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్న సినిమాల బిజినెస్ లెక్కలు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో చిన్న సినిమా…

కృష్ణ అండ్ హిస్ లీల మూవీ బడ్జెట్ అండ్ బిజినెస్ లెక్కలు ఇవీ అంటూ ట్రెండ్ లో వినిపిస్తున్నాయి. ఆ లెక్కల ప్రకారం సినిమా ను మూడేళ్ళ క్రితమే కేవలం 1.2 కోట్ల రేంజ్ బడ్జెట్ లోనే రూపొందించగా…

మూడేళ్ళ పాటు సినిమా రిలీజ్ కి నోచుకోలేదు, ఇలాంటి టైం లో సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు ఈ సినిమా హక్కులను 1.5 కోట్ల రేంజ్ రేటు చెల్లించి దక్కించుకున్నారని సమాచారం. ఇక  సినిమాను నెట్ ఫ్లిక్స్ అండ్ ఆహా యాప్స్ కి అమ్మి రెండింటిలో కొంత గ్యాప్ తో సినిమా ను ప్రదర్శించడం మొదలు పెట్టారు. కాగా సినిమాను నెట్ ఫ్లిక్స్ కి సుమారుగా…

2.4 కోట్ల రేంజ్ రేటుకి అమ్మగా ఆహా యాప్ కి 2.2 కోట్ల రేంజ్ రేటుకి అమ్మారని ట్రేడ్ టాక్… ఇక వీటితో పాటు సినిమా కి శాటిలైట్ రైట్స్ కింద మరో 1.5 కోట్ల రేటు ఆఫర్ దక్కిందని అంటున్నారు. ఇక హిందీ డబ్బింగ్ లెక్కలు తేలాల్సి ఉండగా అది ఒక 60 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో ఉంటుందని అంటున్నారు.

అంటే కేవలం 1.2 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాను ఒక టాప్ ప్రొడ్యూసర్ 1.5 కోట్లకు కోని సినిమా పై ఏకంగా 6.7 కోట్ల రేంజ్ లో బిజినెస్ ని జరిగేలా చూశాడు అని ట్రేడ్ లో అనుకుంటున్నారు… అంటే సినిమా మీద ఏకంగా 5.2 కోట్ల పైగా లాభం దక్కిందని చెప్పొచ్చు…. ఇది సాలిడ్ బిజినెస్ అనే చెప్పాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here