అర్జున్ రెడ్డి, గీత గోవిందం, టాక్సీవాలా సినిమాలు తప్పితే యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ రీసెంట్ టైం లో చేసిన సినిమాలు అన్నీ కూడా నిరాశ పరిచాయి. లాస్ట్ ఇయర్ లైగర్(Liger) మూవీ అద్బుతాలు సృష్టిస్తుంది అనుకున్నా భారీగా నిరాశ పరిచింది. ఇలాంటి టైంలో తనకి సెట్ అయ్యే యూత్ ఫుల్ లవ్ స్టోరీ అయిన ఖుషి(Kushi 2023) తో ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు విజయ్ దేవరకొండ…
మరి ఈ సినిమాతో ఫ్లాఫ్స్ కి బ్రేక్ వేసి తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ అయ్యాడో లేదో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే… జాబ్ దృశ్యా కాశ్మీర్ వెళ్ళిన హీరో అక్కడ హీరోయిన్ ని చూసి ఇష్టపడతాడు… ముందు తను బేగం అనుకున్నా తర్వాత బ్రాహ్మిన్ అమ్మాయని తెలుస్తుంది…
ఇద్దరూ ప్రేమించుకున్న తర్వాత పెద్దలు పెళ్ళికి ఒప్పుకోక పోతే వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్న ఈ జంట లైఫ్ తర్వాత ఎలా సాగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ముందుగా ఈ కథ కొత్త కథ ఏమి కాదు. చాలా రొటీన్ గానే ఉండే కథ…
Kushi 2023 Movie REVIEW And RATING
కానీ రొటీన్ కథకి మంచి ఎంటర్ టైన్ మెంట్, ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్, సోల్ ఫుల్ మ్యూజిక్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తోడు ఉంటే ఆడియన్స్ ఈజీగా ఎంగేజ్ అవుతూ ఎంజాయ్ చేస్తారు.. ఖుషి విషయంలో ఇదే జరిగింది. కథ రొటీన్ గానే అనిపించినా సినిమా లెంత్ కొంచం ఎక్కువ అయ్యి లాగ్ అయినట్లు అనిపించినా కూడా…
విజయ్ దేవరకొండ ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్, సమంత పెర్ఫార్మెన్స్, అక్కడక్కడా వచ్చే మంచి కామెడీ సీన్స్ తో పాటు 3 మంచి పాటలు ఇవన్నీ ఖుషిని చూస్తున్న ఆడియన్స్ కి బాగా నచ్చేలా చేస్తాయి. ఫస్టాఫ్ కథని ఎలాంటి లాగ్ లేకుండా మొదలు పెట్టిన డైరెక్టర్ ఎంటర్ టైన్ మెంట్ సీన్స్ తో పర్వాలేదు అనిపించేలా కథని కొనసాగించి…
తర్వాత పెళ్లి అయ్యాక కొత్త జంటలకు ఎలాంటి సమస్యలు తలెత్తుతాయి లాంటివి బాగానే చెప్పినా సెకెండ్ ఆఫ్ లో కొంత కథ లాగ్ అయినట్లు అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్ పోర్షన్ మట్టుకు సెంటి మెంట్ సీన్స్ తో ఎమోషన్ ని బాగా పండించి ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి వచ్చేలా చేస్తుంది…
లీడ్ యాక్టర్స్ ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ కి, సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్లస్ అవ్వగా ఎడిటింగ్ కొంచం షార్ప్ గా ఉంటే బాగుండేది అనిపించింది, ఫస్టాఫ్ లో సెకెండ్ ఆఫ్ లో కొంత రన్ టైం ని తగ్గించి ఉంటే మరింత క్రిస్ప్ గా సినిమా అనిపించేది. ఇక సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి.
ఇక డైరెక్షన్ విషయానికి శివ నిర్వాణ రొటీన్ కథనే మంచి సీన్స్, సాంగ్స్, కామెడీ, ఎమోషన్స్ ఇలా అన్ని మిక్స్ చేసి బాగా ఆకట్టుకున్నాడు… సినిమా చూస్తున్న టైంలో రొటీన్ గానే అనిపిస్తున్నా ఇవన్నీ కలిసి రొటీన్ అయినా బాగుంది అనిపించేలా చేశాడు… ఓవరాల్ గా ఎలాంటి అంచనాలు లేకుండా ఆడియన్స్ కి అయినా అంచనాలతో వెళ్ళిన ఆడియన్స్ కి అయినా…
ఖుషి సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా మెప్పించడం ఖాయం…. గీత గోవిందం తర్వాత మళ్ళీ విజయ్ దేవరకొండ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించడం ఖాయమని చెప్పొచ్చు. సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ చాలా వరకు ఆడియన్స్ అంచనాలను అందుకుని మెప్పిస్తుంది… సినిమా మా ఫైనల్ రేటింగ్ 3/5 స్టార్స్….