రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ లక్ష్మీస్ ఎన్టీఆర్… మంచి అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల మనసు ని కొంతవరకు గెలుచుకున్నా సినిమా పై నెలకొన్న కాంట్రవర్సీ ల వలన బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు 2 కోట్లకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సత్తా చాటుకుంది, ఇక వీకెండ్ లో సినిమా మొత్తం మీద.
3 కోట్ల షేర్ మార్క్ ని అందుకోగా వర్కింగ్ డేస్ లో మాత్రం సినిమా స్లో డౌన్ అయింది, ఆంధ్ర ప్రదేశ్ లో రిలీజ్ లేక పోవడం తో టోటల్ కలెక్షన్స్ నైజాం అండ్ ఓవర్సీస్ నుండే రాబట్టాల్సి రావడం తో అనుకున్న రేంజ్ వసూళ్లు వర్కింగ్ డేస్ లో రావడం లేదు.
సినిమా మొత్తం మీద 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 6.1 కోట్ల వరకు గ్రాస్ ని వసూల్ చేయగా టోటల్ షేర్ సుమారు 3.5 కోట్ల దాకా ఉందని సమాచారం. కానీ సినిమా ని అమ్మిన రేటు రికవరీ అవ్వాలంటే సినిమా మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పాలి.
సినిమా ను అడ్వాన్స్ బేస్ మీద ఆంధ్ర తప్పితే మిగిలిన చోట్ల కలిపి 5 కోట్ల రేంజ్ లో అమ్మారు, ఆ లెక్కన సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి 6 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సి ఉంటుంది, కానీ ఇప్పటి వరకు కేవలం 3.5 కోట్లు మాత్రమె రికవరీ…
అవ్వడం తో సినిమా రెండో వారం లో రిలీజ్ అయ్యే సినిమాల పోటి ని తట్టుకుని కలెక్షన్స్ ని రాబడితేనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పాలి, లేకపోతె ఎబో యావరేజ్ టు సెమీ హిట్ గా సినిమా పరుగుని ఆపే అవకాశం ఉందని అంటున్నారు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.
Share sagam kuda rakapothe.. above avg ela auddi babu.. mee midi midi gnanamtho champuthunnaru jananni..
brother…cheppindi long run ayyaka verdict gurinchi…present situation gurinchi kadu…