Home న్యూస్ లియో సాంగ్ పై తెలుగు లో భారీ ట్రోలింగ్….ఇలా చేశారేంటి!!

లియో సాంగ్ పై తెలుగు లో భారీ ట్రోలింగ్….ఇలా చేశారేంటి!!

0

ఏ సినిమాలకు అయినా సాంగ్స్ ఆడియన్స్ కి రీచ్ అవ్వడం అన్నది చాలా ముఖ్యం, స్ట్రైట్ మూవీస్ అంటే అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు కానీ డబ్బింగ్ మూవీస్ కి ఇతర భాషాలలో మంచి బజ్ రావాలి అంటే సాంగ్స్ విషయంలో మరింత్ర శ్రద్ధ తీసుకుని మంచి రీచ్ ఉండేలా చూసుకోవాలి…

కోలివుడ్ ప్రజెంట్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనిరుద్ సంగీతం అందించిన లేటెస్ట్ మూవీ దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో(LEO) నుండి రీసెంట్ గా నా రెడీ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు.

తమిళ్ లో ముందు సాంగ్ ని రిలీజ్ చేసినప్పుడు సాంగ్ కి అద్బుతమైన రెస్పాన్స్ సొంతం అయ్యి సాలిడ్ వ్యూస్ తో దూసుకు పోగా తెలుగు లో సినిమా పాటను రీసెంట్ గా రిలీజ్ చేయగా తెలుగు లో పాట లిరిక్స్ భారీ ట్రోల్స్ కి కారణం అవుతుంది ఇప్పుడు….

మ్యూజిక్ బాగానే ఉన్నప్పటికీ తెలుగు లిరిక్స్ మాత్రం నాసిరకంగా అనిపించడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ ని సినిమా సాంగ్ ను ఫేస్ చేస్తుంది… హైప్ ఉన్న సినిమాకి ఇలాంటి నాసిరకం సాంగ్స్ ను పెట్టడం ఏంటి అంటున్నారు. 

కొందరు అయితే తెలుగు లో తమిళ్ పాటలనే రిలీజ్ చేయండి అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు…. ఈ రెస్పాన్స్ ఎలా ఉన్నప్పటికీ సినిమాకి మంచి హైప్ ఉండటంతో కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా కుమ్మేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here