బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో(LEO Movie) భారీ హైప్ తో ఆడియన్స్ ముందుకు వచ్చింది…సినిమా మీద ఉన్న భారీ హైప్ ను సినిమా ఫుల్లుగా అయితే అందుకోలేక పోయింది, దాంతో మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…
తెలుగు లో ఇక తేరుకుంటుందో లేదో అన్న డౌట్స్ నెలకొన్నా కూడా సినిమా అద్బుతమైన హోల్డ్ ని చూపించి పండగ హాలిడేస్ లో జోరుని చూపించి సూపర్బ్ కలెక్షన్స్ ని సాధిస్తూ 4 రోజుల్లో ఆల్ మోస్ట్ బిజినెస్ ను రికవరీ చేసి దుమ్ము లేపగా 5వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇక్కడ టోటల్ గా…
బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని సంచలనం సృష్టించింది ఇప్పుడు… సినిమా 5వ రోజు కలెక్షన్స్ తో తెలుగు లో బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని తెలుగు లో దసరా పండగ టైంలో బ్రేక్ ఈవెన్ ని అందుకున్న మొదటి సినిమా గా నిలిచింది లియో మూవీ… సినిమా అలాగే ఇప్పుడు విజయ్ కెరీర్ లో…
తెలుగు లో హైయెస్ట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమాగా సంచలనం సృష్టించడం విశేషం. ఇంత పోటిలో మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా ఈ రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తూ ఉండటం విశేషం. సినిమా తెలుగు లో టోటల్ రన్ లో మినిమం 20 కోట్ల మార్క్ ని దాటేసి…
25 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పుడు… సినిమా సినిమాకి తన మార్కెట్ ను పెంచుకుంటున్న విజయ్ తెలుగు లో కూడా తన మార్కెట్ ను భారీగా పెంచుకున్నాడు… ఇక లియో బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో జోరు చూపిస్తుందో చూడాలి.