యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య లేటెస్ట్ మూవీస్ అన్నీ కూడా మీడియం రేంజ్ బడ్జెట్ ల తోనే తెరకెక్కిన విషయం తెలిసిందే, కెరీర్ మొదటి నుండి కూడా మరీ ఓవర్ బడ్జెట్ తో నాగ చైతన్య ఎప్పుడూ కూడా సినిమాలు చేయలేదు, 2019 లో మజిలీ సినిమా కెరీర్ బెస్ట్ రికార్డులను తిరగరాసినా కానీ బడ్జెట్ పరంగా 20 కోట్ల రేంజ్ బడ్జెట్ లోనే సినిమా తెరకెక్కింది. కానీ ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో…
సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ మాత్రం క్వాలిటీ పరంగా అద్బుతంగా ఉండబోతుందని అంటున్నారు. అందువలన సినిమా బడ్జెట్ కూడా భారీగానే ఉండబోతుందని అంటున్నారు. ట్రేడ్ లో వినిపిస్తున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం సినిమా కి బడ్జెట్ పరంగా….
35 కోట్లకు పైగానే బడ్జెట్ అయిందని, ఫస్ట్ వేవ్ మరియు ఈ ఇయర్ సెకెండ్ వేవ్ వలన బడ్జెట్ అండ్ ఫైనాన్స్ లాంటివి పెరిగి ఇప్పుడు మొత్తం మీద బడ్జెట్ 42 కోట్ల దాకా సినిమాకి బడ్జెట్ అయిందని వార్తల్లు ఇప్పుడు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. మరి ఇవి ఎంతవరకు నిజం అన్నది త్వరలోనే తెలుస్తుంది కానీ…
ఇదే కనుక నిజం అయితే మట్టుకు నాగ చైతన్య కెరీర్ లో ఇది హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా గా చెప్పుకోవచ్చు, అదే టైం లో సినిమా నాగ చైతన్య కెరీర్ బెస్ట్ రికార్డులతో పాటు మజిలీ సినిమా కన్నా ఒకటిన్నర రెట్లు ఎక్కువ వసూల్ చేసే కెపాసిటీ ఉన్న సినిమా అని కూడా చెప్పుకోవాలి.
సినిమా మీద ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలు ఉన్న ఈ సినిమా కి డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కోసమే ఏకంగా 50 కోట్లకు పైగా రేటు ఇవ్వడానికి కూడా OTT వాళ్ళు ముందుకు వచ్చారు అంటే సినిమా క్రేజ్ అర్ధం చేసుకోవచ్చు. ఈ బడ్జెట్ కి మించి ఆఫర్ వచ్చినా నో చెప్పి థియేటర్స్ లోనే రిలీజ్ కానున్న లవ్ స్టొరీ ఏమాత్రం హిట్ టాక్ ని తెచ్చుకున్న మీడియం రేంజ్ హీరోల్లో రికార్డులను అందుకునే లేదా కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.