అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని రేంజ్ లో విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటాయు…తమిళ్ లో రీసెంట్ టైంలో ఓ చిన్న సినిమా ఇలాంటి విజయాన్నే సొంతం చేసుకుంది. చిన్న సినిమాగా వచ్చి మొదటి రోజే పాజిటివ్ టాక్ తో ఓపెన్ అయ్యి లాంగ్ రన్ లో రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…
ఆ సినిమానే లబ్బర్ పాండు(Lubber Pandhu Telugu Review)….క్రికెట్ లవర్స్ కి చాలా బాగా నచ్చేలా రూపొందిన ఈ సినిమా, ఫ్యామిలీ అండ్ మంచి లవ్ ఎమోషనల్ సీన్స్ తో మెప్పించింది….సినిమా కథ పాయింట్ విషయానికి వస్తే పెళ్లి అయినా క్రికెట్ ను వదలని హీరోయిన్ తండ్రి…
తన ఊర్లో బ్యాటింగ్ లో మంచి పాపులారిటీని సొంతం చేసుకుంటాడు…ఏజ్ అవుతున్నా తన బ్యాటింగ్ లో పవర్ తగ్గదు..కానీ తను క్రికెట్ ఆడటం తన భార్యకి ఇష్టం ఉండదు…అలా ఏళ్ళు గడిచిన తర్వాత హీరో అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో పాపులర్ అవుతాడు…
ఒకానొక టైంలో ఈ ఇద్దరు ఒక మ్యాచ్ లో పోటి పడాల్సి వస్తుంది…ఆ పోటి ఇద్దరిలో ఈగో క్లాషేస్ వలన గొడవలు పెరిగేలా చేస్తుంది, కానీ హీరోయిన్ తండ్రి అవ్వడంతో హీరో హీరోయిన్ తండ్రిని ఎలా ఒప్పించగలిగాడు…వీళ్ళ గొడవ వలన హీరో హీరోయిన్స్ ప్రేమ ఏమయింది అన్నది సినిమా కథ పాయింట్…
హీరోయిన్ తండ్రి తల్లిది ఒక లవ్ స్టోరీ అయితే హీరో హీరోయిన్స్ ది మరో లవ్ స్టోరీ….ఈ రెండు కథలను క్రికెట్ కి కనెక్ట్ చేస్తూ డైరెక్టర్ సినిమాను తీర్చి దిద్దిన తీరు అద్బుతం, ఏ మూమెంట్ కూడా బోర్ ఫీల్ అవ్వకుండా బాగా ఆకట్టుకున్న సినిమా రీసెంట్ టైంలో క్రికెట్ బేస్ మీద…
వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఒకటిగా చెప్పొచ్చు, ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో సౌత్ భాషల్లో సినిమా స్ట్రీం అవుతూ ఉండగా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సినిమా సాలిడ్ గా కుమ్మేసింది….మొదటి రోజు 80 లక్షల గ్రాస్ ఓపెనింగ్స్ తో మొదలు పెట్టి…
టోటల్ రన్ లో తమిళనాడులోనే 40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 45 కోట్ల రేంజ్ లో వసూళ్ళని అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది….ఇప్పుడు ఇతర భాషల ఆడియన్స్ ను కూడా డిజిటల్ లో సాలిడ్ గా ఆకట్టుకుంటూ ఇక్కడ కూడా భారీ విజయాన్ని నమోదు చేస్తుంది ఈ సినిమా..