బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కోసం చాలా టైంగా ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన సుదీర్ బాబు(Sudheer Babu) నటించిన లేటెస్ట్ మూవీ మా నాన్న సూపర్ హీరో(Maa Nanna Super Hero Movie Review) ట్రైలర్ రిలీజ్ తర్వాత డీసెంట్ అంచనాలు ఏర్పడ్డాయి. క్లాసిక్ టచ్ అనిపించేలా ఉన్న మా నాన్న సూపర్ హీరో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత…
ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…మొత్తం మీద కథ పాయింట్ కి వస్తే చినప్పుడే హీరో తండ్రి హీరోని అనాధాశ్రయములో వదిలివెలతాడు, అదే టైంలో హీరోని మరో వ్యక్తి దత్తత తీసుకుంటాడు…కానీ హీరో ఇంట్లో అడుగు పెట్టిన పెద్దగా కలిసి రాకపోవడంతో హీరోని పట్టుంచుకోడు….కానీ పెంచిన తండ్రిని ఎంతో ప్రేమించే…
హీరో తన కోసం ఏదైనా చేయాలని అనుకుంటాడు…ఈ క్రమంలో తండ్రికి డబ్బు చాలా అవసరం అవుతుంది, తర్వాత హీరో ఏం చేశారు, ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా కథ…పెర్ఫార్మెన్స్ పరంగా సుదీర్ బాబు తన కెరీర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు…
సెంటిమెంట్ సీన్స్ కూడా బాగా చేశాడు…ఇతర యాక్టర్స్ అందరూ కూడా తమ తమ రోల్స్ లో మెప్పించగా సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా ఫీల్ కి తగ్గట్లు మెప్పించింది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరంగా మరింత టైట్ గా ఉంటే బాగుండేది…
ఇలాంటి క్లాస్ మూవీస్ చూసే టైంలో కొంచం ఎక్కువ ఓపిక అవసరం, అదే టైంలో మేకర్స్ సెంటిమెంట్ సీన్స్, ఎమోషనల్ సీన్స్ ను పెడతారు కాబట్టి సినిమా అక్కడక్కడా డ్రాగ్ అయినట్లు స్లో అయినట్లు అనిపించడం ఖాయం, ఈ సినిమా విషయంలో కూడా అదే రిపీట్ అవ్వగా…
ఓవరాల్ గా ఎమోషనల్ కంటెంట్ ఆకట్టుకోవడం, డైరెక్టర్ చేసిన సిన్సియర్ అటెంప్ట్ ను మెచ్చుకుని తీరాల్సిందే… అదే టైంలో క్లాస్ కంటెంట్ చాలా వరకు ఆకట్టుకున్నా స్లో నరేషన్ ని ఒక్కటి ఓపికతో తట్టుకోగలిగితే సినిమా మంచి ఫీల్ ని కలిస్తూ మంచి సినిమా చూసిన ఫీలింగ్ తోనే…
ఆడియన్స్ థియేటర్స్ బయటికి వచ్చేలా చేస్తుంది….మొత్తం మీద ట్రైలర్ నుండే సినిమా ఎలా ఉండబోతుందో మేకర్స్ చెప్పగా అదే గుర్తు పెట్టుకుని థియేటర్స్ కి వెళితే కొంచం పడుతూ లేస్తూ సినిమా సాగినా ఓవరాల్ గా మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో ఆడియన్స్ థియేటర్స్ బయటికి రావడం ఖాయమని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 3 స్టార్స్…