Home న్యూస్ మగధీర స్పెషల్ షోల కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ సామి ఇదీ!!

మగధీర స్పెషల్ షోల కలెక్షన్స్….మైండ్ బ్లాంక్ సామి ఇదీ!!

0

టాలీవుడ్ లో రీసెంట్ టైంలో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎంత ఫాస్ట్ గా డెవలప్ అయిందో కొందరి అత్యాశ వలన వరుస పెట్టి ఓల్డ్ మూవీస్ రీ రిలీజ్ లు చేస్తూ వెళ్ళడంతో ఆడియన్స్ కూడా బోర్ ఫీల్ అయ్యి ఇప్పుడు మంచి రీ రిలీజ్ లను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు…ఈ క్రమంలో ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డుల…

బెండు తీసిన ఎపిక్ మగధీర(Magadheera Re Release Collections) ఇప్పుడు రీ రిలీజ్ లో నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకుంది….హైదరాబాదు లో స్పెషల్ షోలతో 8 లక్షలకు పైగా వసూళ్లు సాధించినా కూడా మిగిలిన చోట్ల పెద్దగా ఇంపాక్ట్ ను ఏమి చూపించ లేక పోయింది ఈ సినిమా…..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) పుట్టిన రోజు కానుకగా స్పెషల్ షోలను వేయగా కొన్ని ఫ్యాన్స్ షోలకు మంచి రెస్పాన్స్ వచ్చినా కూడా చాలా చోట్ల మాత్రం ఏమాత్రం అంచనాలను అందుకోలేక పోయింది ఈ సినిమా… ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి ఓవరాల్ గా సినిమా స్పెషల్ షోల పరంగా 16-18 లక్షల రేంజ్ లో గ్రాస్ బుకింగ్స్ ను…

బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుందని అంచనా….లాస్ట్ ఇయర్ రామ్ చరణ్ పుట్టిన రోజుకి ఆరెంజ్ మూవీ రీ రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది, కానీ ఇప్పుడు ఎపిక్ మగధీర సినిమా ఏమాత్రం అంచనాలను అందుకోక పోవడం అందరికీ షాకిచ్చింది… నార్మల్ టైం రీ రిలీజ్ అంటే ఈ రిజల్ట్ ను ఎక్స్ పెర్ట్ చేయోచ్చు కానీ…

స్పెషల్ టైం లో రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఏర్పాటు చేసిన స్పెషల్ షోలకు ఇలాంటి లో రెస్పాన్స్ అయితే ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయలేదు… దాంతో రీ రిలీజ్ ల ట్రెండ్ ఇక ఎండ్ స్టేజ్ కి వచ్చేయబోతుంది అని చెప్పొచ్చు. అప్ కమింగ్ రీ రిలీజ్ లకు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ ఉంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here