Home న్యూస్ టిల్లు స్క్వేర్ థియేటర్స్, బుకింగ్స్….డే 1 ఎంత కలెక్ట్ చేయోచ్చు!!

టిల్లు స్క్వేర్ థియేటర్స్, బుకింగ్స్….డే 1 ఎంత కలెక్ట్ చేయోచ్చు!!

0

డిజే టిల్లు(Dj Tillu Movie) భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న సిద్హూ జొన్నలగడ్డ(siddhu jonnalagadda) ఆ సినిమా సీక్వెల్ గా చేసిన లేటెస్ట్ మూవీ టిల్లు స్క్వేర్(Tillu Square Movie) భారీ అంచనాల నడుమ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సినిమా మీద యూత్ లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి అని చెప్పాలి…

ఇక సినిమా ట్రైలర్ లు కూడా క్లిక్ అవ్వడంతో బిజినెస్ పరంగా కూడా మంచి జోరుని చూపించిన సినిమా ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కూడా దుమ్ము లేపుతూ దూసుకు పోతుంది. తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ను రీసెంట్ గా ఓపెన్ చేయగా ఒక్క హైదరాబాదు నుండే 1.25 కోట్ల గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకోగా…

టోటల్ గా తెలుగు రాష్ట్రాల గ్రాస్ బుకింగ్స్ 2.5 కోట్ల దాకా ఉన్నాయి. ఇక ఓవర్సీస్ లో ఆల్ రెడీ ప్రీ టికెట్ సేల్స్ ద్వారా ఆల్ మోస్ట్ 250K డాలర్స్ మార్క్ ని అందుకున్న సినిమా అద్బుతమైన బుకింగ్స్ తో జోరు చూపిస్తుంది. ఇక రిలీజ్ అయిన తర్వాత టాక్ పాజిటివ్ గా ఉంటే షో షోకి కలెక్షన్స్ పరంగా మంచి జోరుని సినిమా చూపించవచ్చు.

ఇక ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా 3.5 కోట్ల రేంజ్ నుండి 4 కోట్ల రేంజ్ దాకా ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది, టాక్ ను బట్టి ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి.

ఇక సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 550 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా 800వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా కి అన్నీ పెర్ఫెక్ట్ గా ఉండగా జస్ట్ హిట్ టాక్ వస్తే చాలని చెప్పొచ్చు. ఇక మొదటి రోజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here