Home న్యూస్ ట్రివియా: మగధీర టైటిల్ ఫస్ట్ అనుకున్న సినిమా ఏదో తెలుసా?

ట్రివియా: మగధీర టైటిల్ ఫస్ట్ అనుకున్న సినిమా ఏదో తెలుసా?

0

ఒక సినిమా కి అనుకున్న టైటిల్ మరో సినిమా కి వాడటం, తీసుకోవడం లాంటివి అందరికీ తెలిసినవే… ఒక సినిమా కి అనేక టైటిల్స్ ని పరిశీలన లోకి తీసుకుని అందులో ఏది బెటర్ అనిపిస్తే ఆ టైటిల్ ని వాడతారు. టాలీవుడ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్స్ లో ఒకటైన మగధీర గురించి అందరికీ తెలిసిందే. టాలీవుడ్ హిస్టరీ లోనే మొట్ట మొదటి 50, 60, 70 కోట్ల షేర్ మార్క్ అందుకున్న సినిమా ఇది.

ఇలాంటి ఈ సినిమా ఎంత పవర్ ఫుల్ గా ఉందో సినిమా టైటిల్ కూడా అదే రేంజ్ లో జనాల్లో జొచ్చుకు పోయింది. ఈ సినిమా టైటిల్ టాలీవుడ్ లో ముందు అనుకున్న సినిమా ఎదో తెలుసా… మెగాస్టార్ చిరంజీవి ఇది వరకు మగధీరుడు సినిమా తీశారు.

కానీ మగధీర అనే టైటిల్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ సినిమా కి అనుకున్నారు. ఆ సినిమా కోసం సుమారు 40 వరకు టైటిల్స్ ని పరిశీలన లోకి తీసుకున్నారని సమాచారం. అందులో చివరి వరకు మగధీర టైటిల్ నే అనుకున్నారట డైరెక్టర్… కానీ చివరి నిమిషంలో…

ఆ టైటిల్ ని కాకుండా టక్కరి దొంగ టైటిల్ ని కన్ఫాం చేశారు, సినిమా కాన్సెప్ట్ కి కూడా ఆ టైటిల్ పెర్ఫెక్ట్ యాప్ట్ అవ్వడం తో మగధీర టైటిల్ కనుమరుగు అయ్యి టక్కరి దొంగ ఫైనల్ అయింది. మళ్ళీ 2009 లో వచ్చిన మగధీర సినిమా కి మళ్ళీ చిరు మగధీరుడు టైటిల్ కన్సిడరేషన్ చేసినా..

అది మారి చివరికి మగధీర గా ఫిక్స్ అయింది. తర్వాత మగధీర సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాయడం తో ఆ పేరు కి క్రేజ్ మరింత పెరిగి పోయింది. ఇలా చాలా సినిమాల టైటిల్స్ ముందు ఒక సినిమా కి అనుకున్న తర్వాత మరో సినిమా కి షిఫ్ట్ అయ్యాయి. ఒక్కొటిగా అప్పుడప్పుడు వీటి గురించి అప్ డేట్ చేస్తాం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here