Home న్యూస్ ఆదికేశవ బిజినెస్…క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

ఆదికేశవ బిజినెస్…క్లీన్ హిట్ టార్గెట్ ఇదే!!

0

మొదటి సినిమా ఉప్పెన(Uppena Movie) తోనే సంచలన రికార్డ్ కలెక్షన్స్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న పంజా వైష్ణవ్ తేజ్(Panja Vaishnav Tej) ఆ తర్వాత మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపించలేదు. కొండపోలం మరియు రంగ రంగ వైభవంగా లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా…

నిరాశ పరిచే రిజల్ట్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఆదికేశవ(AadiKeshava Movie) ఈ వీకెండ్ లో గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 550 వరకు థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా 750 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా…

ఓవరాల్ గా సాధించిన వాల్యూ బిజినెస్ రేంజ్ 8.5 -9 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా… కొన్ని చోట్ల ఓన్ రిలీజ్ ను కొన్ని చోట్ల బయర్స్ కొనగా ఓవరాల్ గా ఈ రేంజ్ లో సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఉండే అవకాశం ఉందని ట్రేడ్ లో సమాచారం. దాంతో సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర…

ఓవరాల్ గా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే మినిమం 9.5 కోట్ల కి అటూ ఇటూగా షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు, సినిమా ట్రైలర్ పక్కా మాస్ టచ్ తో బాగానే ఆకట్టుకోగా సినిమా కి టాక్ బాగుంటే మాస్ సెంటర్స్ లో రెవెన్యూ బాగానే వచ్చే అవకాశం ఉంది.

మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ కలెక్షన్స్ ను సొంతం చేసుకోగలుగుతుందో చూడాలి ఇప్పుడు….ఎక్స్ లెంట్ స్టార్ట్ తర్వాత కెరీర్ లో స్లో అయిన వైష్ణవ్ తేజ్ ఈ సినిమా తో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here