Home న్యూస్ మహర్షి టోటల్ థియేటర్స్ కౌంట్…జస్ట్ లో రికార్డ్ మిస్!!

మహర్షి టోటల్ థియేటర్స్ కౌంట్…జస్ట్ లో రికార్డ్ మిస్!!

0

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సర్వం సిద్ధం అయ్యింది, కాగా బాక్స్ ఆఫీస్ దగ్గర 101 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా ఇప్పుడు ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న థియేటర్స్ కౌంట్ కన్ఫాం అయ్యింది. ఒక్క సారి ఆ లెక్కల్లోకి వెళితే, నైజాం మొత్తం మీద ప్లెక్సులతో కలిపి సుమారు 400 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుంది.

ఇక ఆంధ్రా లో 450 వరకు థియేటర్స్ లో సీడెడ్ లో 300 వరకు థియేటర్స్ లో సినిమా రిలీజ్ కానుంది, మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో 1150 వరకు థియేటర్స్ లో మహర్షి రిలీజ్ కానుంది, ఇక కర్ణాటకలో లో 265 థియేటర్స్ లో రెస్ట్ ఆఫ్ ఇండియా లో 220 థియేటర్స్ లో…

రిలీజ్ కానున్న సినిమా ఓవర్సీస్ మొత్తం మీద 275 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ కానుంది, దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సుమారు 1900 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది, కాగా ఇది వరకు మహేష్ నటించిన స్పైడర్ మరియు భరత్ అనే నేను రెండూ 2000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి, కానీ ఇప్పుడు మహర్షి జస్ట్ లో హాట్రిక్ 2000 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ రికార్డ్ ను మిస్ చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here