సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారం సాలిడ్ కలెక్షన్స్ తో 75 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సంచలనం సృష్టించగా సినిమా ఇప్పుడు రెండో వారం లో అడుగు పెట్టింది, కాగా సినిమా రెండో వారం మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 7 వ రోజు తో పోల్చితే డ్రాప్స్ కొంచం ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి, కానీ నైజాం లో కొన్ని సెంటర్స్ లో అలాగే ఆంధ్రా లో…
కొన్ని సెంటర్స్ లో బుకింగ్స్ బాగున్నాయి…. సీడెడ్ లో సినిమా మరింత స్లో అయ్యింది, మొత్తం మీద రెండో వారం మొదటి రోజు సినిమా ఓవరాల్ డ్రాప్స్ 40% వరకు ఉన్నట్లు తెలుస్తుంది, కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల బుకింగ్స్ బాగుండటం తో సినిమా రోజుని…
పర్వాలేదు అనిపించే విధంగా ముగించే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ బాగుంటే సినిమా 1.7 కోట్ల రేంజ్ కి పైగా షేర్ ని అందుకోవచ్చు. అలా జరగక పొతే కనుక 1.5 కోట్లకి పైగా షేర్ ని సినిమా 8 వ రోజు అందుకునే చాన్స్ ఉంది, మరి రోజు ముగిసే సరికి సినిమా ఎంతవరకు హోల్డ్ చేస్తుందో చూడాలి.