Home న్యూస్ మహర్షి సెన్సార్ రివ్యూ….హిట్టు బొమ్మ!

మహర్షి సెన్సార్ రివ్యూ….హిట్టు బొమ్మ!

0

     టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా గా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ మహర్షి భారీ ఎత్తున మరి కొన్ని రోజుల్లో రిలీజ్ కానుండగా సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకుంది, అక్కడ నుండి సినిమా కథ పాయింట్ ఏంటి హైలెట్స్ ఏంటి లాంటివి అన్ని రివీల్ అయ్యాయి కానీ ఇక్కడ సినిమా కథ గురించిన ఎలాంటి లీకులు ఇవ్వడం లేదు. ఓవరాల్ గా సినిమా కి…

సెన్సార్ నుండి ఎలాంటి టాక్ వచ్చిందో తెలియజేస్తున్నాం, మహేష్ మూడు డిఫెరెంట్ లుక్స్ లో సినిమా లో మెప్పించాడని అంటున్నారు, కాలేజ్ ఎపిసోడ్ లుక్ మొదట్లో కొంచం కొత్తగా ఉన్నా తర్వాత మిగిలిన లుక్స్ తో పోల్చితే ఆ లుక్ స్పెషల్ గా ఉంటుంది అంటున్నారు.

ఇక మహేష్ కి మరీ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కాకున్నా సినిమా కి ఎంత కావాలో అంత ఇచ్చే రోల్ లో తన నటనతో మెప్పించాడు అని అంటున్నారు, కొన్ని సార్లు రొటీన్ సటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఉండటం రిపీటివ్ గా అనిపిస్తుందని అది తప్పితే మిగిలిన సీన్స్ లో యాక్షన్ ఓ రేంజ్ లో ఉంటుందని,

పోకిరి, బిజినెస్ మ్యాన్ రేంజ్ లో ఇంటెన్స్ యాక్టింగ్ తో ఫైట్ సీన్స్ పేకాడేశాడని అంటున్నారు, ఇక అల్లరి నరేష్ రోల్ హార్ట్ టచింగ్ గా ఉంటుందని, పూజా హెగ్డే కూడా ఉన్నంతలో ఆకట్టుకోగా ఫాదర్ సన్ సీన్స్ బాగా రాసుకున్నారని అంటున్నారు.

దేవి పాటలు వినడం కన్నా చూడటానికి బాగున్నాయని, బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుందని అంటున్నారు, లెంత్ ఒక్కటే కొంచం ఎక్కువ అయిన ఫీలింగ్ కలుగుతుందని, అదొక్కటి పక్కకు పెడితే సినిమా ప్రేక్షకుల మనసు గెలుచుకునే అవకాశం ఎక్కువ గా ఉందని అంటున్నారు. మొత్తం మీద సెన్సార్ నుండి సినిమా కి హిట్ టాక్ ఆల్ మోస్ట్ వచ్చినట్లే అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here