టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ మహర్షి రెండు రోజుల్లోనే నైజాం ఏరియా లో 9.7 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది, సినిమా మొదటి రోజు 6.38 కోట్ల షేర్ ని రెండో రోజు 3.32 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించగా మూడో రోజు మార్నింగ్ షోలు పూర్తి అయ్యే సమయానికి సినిమా మొత్తం మీద నైజాం ఏరియా లో 10 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది.
దాంతో మహేష్ బాబు కెరీర్ లో నైజాం ఏరియాలో 7 వ 10 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమా గా నిలిచింది మహర్షి సినిమా. ఇది వరకు మహేష్ బాబు కెరీర్ లో పోకిరి, దూకుడు, బిజినెస్ మాన్, సీతమ్మ వాకిట్లో సిరి మల్లె చెట్టు, శ్రీమంతుడు….
భరత్ అనే నేను ఇప్పుడు మహర్షి సినిమాలు 10 కోట్ల మార్క్ ని అందుకున్నాయి. మహర్షి సినిమా మూడు రోజుల నైజాం కలెక్షన్స్ 12 కోట్ల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి, సూపర్ స్టార్ వీరంగం ఇలాగే కొనసాగితే నైజాం లో సినిమా రానున్న రోజుల్లో మరిన్ని అద్బుతాలు నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.