బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో అందరినీ కొద్ది వరకు ఆకర్షించిన సినిమాల్లో మళ్ళీ పెళ్లి ఒకటి… నిజ జీవితపు జంట అయిన నరేష్ మరియు పవిత్రా లోకేష్ లు కలిసి నటించిన ఈ సినిమా ఆల్ మోస్ట్ వీళ్ళ లైఫ్ స్టొరీని బేస్ చేసుకుని వీళ్ళ మ్యారేజ్ పై జనాల్లో ఉన్న అనేక అనుమానాలకు సమాదానంగా MS రాజు గారి డైరెక్షన్ లో తెరకెక్కింది. మరి సినిమా ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ..
సినిమా స్టొరీ పాయింట్ కి వస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న ఒక నటుడికి తన లైఫ్ లో ఎలా 3 పెళ్ళిళ్ళు జరిగాయి, ఆ పెళ్ళిళ్ళతో తను ఎలా సతమతం అయ్యాడు, ఒక సినిమా షూటింగ్ లో తన సహా నటిని చూసి ఎలా ఆకర్షితుడు అయ్యాడు, తర్వాత ఇద్దరూ ఎలా కలిశారు అన్నది సినిమా స్టొరీ పాయింట్…
నరేష్ మరియు పవిత్రా లోకేష్ ల ప్రేమ తర్వాత జరిగిన గొడవలు అన్నీ మీడియా వలన చాలామంది ప్రేక్షకులకు తెలిసిందే, కానీ ఇలా ఇదంతా జరగడానికి కారణాలు ఏంటి అనేది సినిమాలో చూపించారు, అవి 5 చాప్టర్లుగా విభజించి ఒక్కో చాప్టర్ లో ఒక్క కథని చెబుతూ కొద్ది వరకు ఎంగేజింగ్ గానే కథని నడిపినా… కొంత పార్ట్ సహనానికి పరీక్ష పడుతుంది…
అలా అని సినిమా మరీ బోర్ కొడుతుందా అంటే అది కూడా కాదు, కొన్ని సీన్స్ ని బాగానే ఆసక్తిగా మలచడంతో వీళ్ళ లైఫ్ లో ఇన్ని జరిగాయా అనిపిస్తుంది, నరేష్ మరియు పవిత్రా లోకేష్ లు ఇద్దరూ తమ రోల్స్ లో జీవించి నటించారు. కొన్ని సీన్స్ నరేష్ కి వ్యతిరేకంగా కూడా సినిమాలో ఉండటం విశేషం… కొన్ని సీన్స్ కొంచం ఓవర్ గా కూడా అనిపిస్తాయి…
సంగీతం పర్వాలేదు అనిపించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే నెమ్మదిగా కొన్ని చోట్ల బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండగా MS రాజు గారి డైరెక్షన్ పర్వాలేదు అనిపిస్తుంది. ఎటొచ్చి సినిమాలో కొన్ని ఆసక్తి కరమైన సన్నివేశాలు ఉన్నప్పటికీ బోర్ కొట్టించే సీన్స్…
అలాగే సహనానికి పరీక్ష పెట్టె సీన్స్ కూడా ఉండటంతో, ఓపిక చేసుకుని చూస్తె సినిమా పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది… ఎదో పెద్ద పెద్ద కాంట్రవర్సీలు సినిమాలో చూపెడతారు అనుకుంటే మట్టుకు నిరాశ తప్పదు. మొత్తం మీద మరీ బోర్ ఫీల్ అయితే సినిమాకి వెళ్లి కొంచం ఓపికతో చూస్తె ఒకసారి చూసేలా అనిపిస్తుంది మళ్ళీ పెళ్లి సినిమా… సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్.