Home న్యూస్ 17 కోట్ల సినిమా…OTT రేటు అండ్ డిజిటల్ రిలీజ్ డేట్ ఇదే!!

17 కోట్ల సినిమా…OTT రేటు అండ్ డిజిటల్ రిలీజ్ డేట్ ఇదే!!

0

సీనియర్ యాక్టర్ నరేష్ మరియు పవిత్రా లోకేష్ ల కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ మళ్ళీ పెళ్లి(Malli Pelli Ott Release Date) ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా వచ్చినా ఆడియన్స్ ను ఏమాత్రం మెప్పించలేక పోయింది. పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ వచ్చినా….

జనాలు మాత్రం సినిమాను చూడటానికి థియేటర్స్ కి అయితే అనుకున్న రేంజ్ లో రాలేదు. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో నిరాశ పరిచి డిసాస్టర్ గా పరుగును పూర్తీ చేసుకుంది. బడ్జెట్ పరంగా రిజల్ట్ చెప్పాలి అంటే మాత్రం…

సినిమా 17 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో నిర్మాణం అవ్వగా కలెక్షన్స్ పరంగా అందులో 5% కూడా రికవరీని సొంతం చేసుకోలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాఫ్ అయిన ఈ సినిమాను ఇప్పుడు రెండు OTT లలో డిజిటల్ రిలీజ్ చేయబోతున్నారు. 

సినిమా ముందు 3 కోట్ల రేటుకి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు హక్కులు సొంతం చేసుకోగా ఆహా వీడియో వాళ్ళు 1 కోటి రేటు చెల్లించి సినిమా డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్నారని ట్రేడ్ సమాచారం. ఇక సినిమా ఈ రెండు OTT లలో కూడా ఈ నెల 23న డిజిటల్ రిలీజ్ కానుంది.

బాక్స్ ఆఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాఫ్ అయినా కూడా ఈ సినిమా మీద రిలీజ్ కి ముందు ఉన్న కాంట్రవర్సీల కారణంగా ఇప్పుడు OTT రిలీజ్ తర్వాత సాలిడ్ గా వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ సినిమా OTT లో ఎలాంటి రెస్పాన్స్ ను దక్కించుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here