Home గాసిప్స్ OTT నుండి మళ్ళీ పెళ్లి సినిమా ఔట్…రీజన్ ఇదేనా??

OTT నుండి మళ్ళీ పెళ్లి సినిమా ఔట్…రీజన్ ఇదేనా??

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో తెలుగు లో కొంచం కాంట్రవర్సీలను క్రియేట్ చేసిన సినిమాలలో సీనియర్ యాక్టర్ నరేష్(Naresh) నటించిన మళ్ళీ పెళ్లి(Malli Pelli OTT) ఒకటి… నరేష్ మరియు పవిత్రా లోకేష్ ల లైఫ్ స్టొరీతో వచ్చిన ఈ సినిమా…

ట్రైలర్ రిలీజ్ తోనే డీసెంట్ అంచనాలను సొంతం చేసుకోగా అదే టైంలో కంట్రవర్సీలను కూడా సొంతం చేసుకున్నప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా హెల్ప్ అయితే కాలేదు. దాంతో మొత్తం మీద 17 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కింది అన్న ఈ సినిమా…

అందులో 5% రికవరీని కూడా సొంతం చేసుకోలేక పోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా సినిమా రెండు OTT లలో ఒకేసారి రిలీజ్ అయింది, ఆహా వీడియో(Aha Video) మరియు అమెజాన్ ప్రైమ్(Prime Video) లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ నుండి తీసేశారు….

దానికి కారణం సినిమా పై కోర్టులో నరేష్ గారి మాజీ భార్య కేసు వేయడంతో కోర్టులో కేసు నడుస్తుండగానే సినిమాను ఇప్పుడు ప్రైమ్ వీడియో నుండి తొలగించినట్లు తెలుస్తుంది, కానీ ఆహా వీడియోలో మాత్రం సినిమా ఇంకా స్ట్రీమ్ అవుతూనే ఉంది.

ప్రైమ్ వీడియోలో ఎదో గ్లిట్చ్ వలన తీశారు అంటున్నా కానీ కోర్టులు నరేష్ మాజీ భార్య తన పై విషప్రచారం చేశారు అంటూ ఈ సినిమాను OTT నుండి తొలగించాల్సిందిగా కోరడంతో ఇప్పుడు ఒక OTT నుండి తొలగించారు అని అంటున్నారు కానీ త్వరలోనే తిరిగి సినిమా ప్రైమ్ వీడియోలో వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here