Home న్యూస్ మళ్ళీ పెళ్లి…వీకెండ్ కలెక్షన్స్….ఎంత వచ్చాయంటే!!

మళ్ళీ పెళ్లి…వీకెండ్ కలెక్షన్స్….ఎంత వచ్చాయంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సీనియర్ యాక్టర్ నరేష్ నటించిన లేటెస్ట్ మూవీ మళ్ళీ పెళ్లి సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో టాక్ అయితే ఆడియన్స్ నుండి లభించింది, రిలీజ్ కి ముందు కొంచం బజ్ ఏర్పడినా కలెక్షన్స్ పరంగా మాత్రం ఆ బజ్ పెద్దగా సినిమాకి హెల్ప్ అవ్వడం లేదు అని చెప్పాలి ఇప్పుడు.

మొదటి రోజు మొత్తం మీద 35 లక్షల లోపు గ్రాస్ ను అందుకున్న సినిమా, రెండో రోజు భారీగా డ్రాప్ అయ్యి 12 లక్షల లోపే గ్రాస్ ను అందుకోగా మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ ఉన్నప్పటికీ సినిమా పెద్దగా హోల్డ్ ని చూపించలేక పోయింది..

టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు గ్రాస్ 10 లక్షల లోపే ఉంటుందని చెప్పాలి. దాంతో టోటల్ గా సినిమా 3 రోజుల వీకెండ్ లో 57 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా….

టోటల్ గా షేర్ 25 లక్షలకు పైగా ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 1.60 కోట్ల దాకా ఉండగా ఆ మొత్తాన్ని అందుకోవాలి అంటే సినిమా ఇంకా 1.35 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సినిమా వర్కింగ్ డేస్ లో ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here