Home న్యూస్ 2 డేస్ మళ్ళీ పెళ్లి కలెక్షన్స్….మైండ్ బ్లాంక్!

2 డేస్ మళ్ళీ పెళ్లి కలెక్షన్స్….మైండ్ బ్లాంక్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో సీనియర్ యాక్టర్ నరేష్ నటించిన మళ్ళీ పెళ్లి సినిమా ఒకటి. రిలీజ్ కి ముందు ప్రోమోలు ట్రైలర్ తో కొంత బజ్ ను సొంతం చేసుకుని ఆడియన్స్ ముందుకు రిలీజ్ అయిన ఈ సినిమా బడ్జెట్ పరంగా ఆల్ మోస్ట్ మీడియం రేంజ్ మూవీస్ ల మాదిగా రూపొండినా రిలీజ్ అవ్వడం మాత్రం చిన్న సినిమా రేంజ్ లోనే రిలీజ్ అయింది.

మొదటి రోజు అటూ ఇటూగా హైప్ వలన 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా రెండో రోజు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర హోల్డ్ ని చూపించలేక పోయింది. మొదటి రోజుతో పోల్చితే ఇతర సినిమాలు కొంచం గ్రోత్ ని చూపించినా ఈ సినిమా మాత్రం..

ఆల్ మోస్ట్ 65% రేంజ్ లో డ్రాప్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర 12 లక్షల రేంజ్ లోపే గ్రాస్ ను రెండో రోజు సొంతం చేసుకుంది ఇప్పుడు. దాంతో టోటల్ గా సినిమా 2 రోజుల గ్రాస్ లెక్క 47 లక్షల రేంజ్ లో ఉండగా అందులో నుండి వర్త్ షేర్ లెక్క అటూ ఇటూగా 18 లక్షల దాకా…

ఉంటుందని అంచనా… సినిమా వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 1.6 కోట్లు కాగా ఇంకా చాలా దూరమే సినిమా వెళ్ళాల్సి ఉంటుంది, బడ్జెట్ పరంగా మాత్రం సినిమా భారీగా నిరాశ పరిచింది అని చెప్పాలి బాక్స్ ఆఫీస్ దగ్గర. ఇక సినిమా మిగిలిన రన్ లో ఇంకా ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here