Home న్యూస్ మిక్సుడ్ టాక్ తో కుమ్మేసిన మమ్ముట్టి టర్బో…2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్!

మిక్సుడ్ టాక్ తో కుమ్మేసిన మమ్ముట్టి టర్బో…2 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్!

0

ఈ ఇయర్ మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చితే సెన్సేషనల్ ఫామ్ లో ఉన్న మలయాళ ఇండస్ట్రీ నుండి ఇప్పుడు మిక్సుడ్ టు యావరేజ్ రేంజ్ మూవీ రిలీజ్ అయినా కూడా సాలిడ్ కలెక్షన్స్ తో జోరు చూపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. లేటెస్ట్ గా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) నటించిన లేటెస్ట్ మూవీ టర్బో(Turbo Movie 2 Days Collections)….

ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రిలీజ్ అవ్వగా ముందు ఎబో యావరేజ్ రేంజ్ టాక్ వినిపించినా కూడా తర్వాత అది మిక్సుడ్ రెస్పాన్స్ గా మారిపోయింది. అయినా కూడా ఓపెనింగ్స్ పరంగా మమ్ముట్టి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకున్న ఈ సినిమా ఆల్ మోస్ట్ 14.20 కోట్ల రేంజ్ లో…

ఓపెనింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకోగా రెండో రోజు టాక్ మిక్సుడ్ గానే ఉన్నా కూడా ఎక్స్ లెంట్ గా హోల్డ్ ని చూపించి కేరళలో కుమ్మేసింది. 2 రోజుల్లో కేరళలో ఓవరాల్ గా సినిమా 10.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.9 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది.

దాంతో టోటల్ గా 2 రోజుల్లో ఇండియాలో 12.20 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకున్న సినిమా ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ గా కుమ్మేసి 14.50 కోట్లు ఓవర్సీస్ నుండే రాబట్టింది. మలయాళ సినిమాలకు ఓవర్సీస్ పెద్ద మార్కెట్ కాగా కేరళకి మించి కలెక్షన్స్ ఓవర్సీస్ నుండి వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

దాంతో మొత్తం మీద 2 రోజులు పూర్తి అయ్యే టైంకి సినిమా వరల్డ్ వైడ్ గా 26.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుని కుమ్మేసింది. మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా రెండో రోజు ఆల్ మోస్ట్ మొదటి రోజుకి ఈక్వల్ గా వసూళ్ళని అందుకున్న ఈ సినిమా లాంగ్ రన్ లో హోల్డ్ చేస్తుందని టీం ఆశిస్తున్నారు. మరి ఈ టాక్ తోనే సినిమా 100 కోట్ల క్లబ్ కి చేరువ అవుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here