Home న్యూస్ శర్వానంద్ మనమే మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్…డే 1 ఎంత రావొచ్చు అంటే!

శర్వానంద్ మనమే మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్…డే 1 ఎంత రావొచ్చు అంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రెండేళ్ళ క్రితం ఒకే ఒక జీవితం(Oke Oka Jeevitham) మూవీతో మంచి హిట్ ను అందుకున్న శర్వానంద్(Sharwanand) ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ అయిన మనమే(Manamey Movie) మూవీ ఆడియన్స్ ముందుకు శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా సినిమా….

ఆల్ మోస్ట్ 650 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా ఓవరాల్ గా 12 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతుంది. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మూడు రోజుల ముందుగానే ఓపెన్ అవ్వగా క్లాస్ సెంటర్స్ లో బుకింగ్స్ జస్ట్ ఓకే అనిపించగా మిగిలిన చోట్ల బుకింగ్స్ బిలో పార్ గానే ఉన్నాయి అని చెప్పాలి.

దాంతో సినిమా ఓవరాల్ గా ఇప్పుడు మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ కాబోతుంది అని చెప్పాలి ఇప్పుడు…టాక్ బాగుంటే షో షోకి కలెక్షన్స్ పరంగా సినిమా జోరు పెంచే అవకాశం ఉండగా ప్రజెంట్ బుకింగ్స్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే మొదటి రోజున సినిమా 1.2 కోట్ల రేంజ్ నుండి 1.4 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది.

ఇక టాక్ ను బాగుంటే బాక్స్ అఫీస్ దగ్గర షో షో కి కలెక్షన్స్ పరంగా గ్రోత్ ని చూపించి డీసెంట్ కలెక్షన్స్ ని అందుకునే ఛాన్స్ అయితే ఉంది… ఇక శర్వానంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుని మొదటి రోజు కలెక్షన్స్ పరంగా శర్వానంద్ కి మంచి ఓపెనింగ్స్ ను సొంతం అయ్యేలా చేస్తుందో లేదో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here