Home న్యూస్ శర్వానంద్ ఊరమాస్…మనమే మూవీ కి సాలిడ్ నాన్ థియేట్రికల్ బిజినెస్!

శర్వానంద్ ఊరమాస్…మనమే మూవీ కి సాలిడ్ నాన్ థియేట్రికల్ బిజినెస్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర శర్వానంద్(Sharwanand) నటించిన ప్రీవియస్ మూవీస్ లో ఒక్క ఒకే ఒక జీవితం(Oke Oka Jeevitham Movie) మాత్రమే ఆడియన్స్ అంచనాలను అందుకుని మంచి విజయాన్ని సొంతం చేసుకోగా ఆ సినిమా తర్వాత ఆల్ మోస్ట్ ఏడాదిన్నర గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు శర్వానంద్ నటించిన లేటెస్ట్ మూవీ…

మనమే(Manamey Movie) మూవీ ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా కోసం మొదటి నుండి చాలా జాగ్రత్తలు తీసుకున్న శర్వానంద్ లిమిటెడ్ బడ్జెట్ లోనే సినిమా పూర్తి అయ్యేలా చూసుకున్నాడు. ఆల్ మోస్ట్ 30 కోట్ల రేంజ్ బడ్జెట్ లో సినిమా నిర్మాణం కంప్లీట్ అవ్వగా…

ఇప్పుడు బిజినెస్ పరంగా కూడా మంచి జోరుని చూపిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి ముందే నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం కంప్లీట్ అయ్యిందని తెలుస్తుంది. తెలుగు శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్స్ అలాగే డబ్బింగ్ రైట్స్ తో కలిపి ఓవరాల్ గా 27.50 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకుందని సమాచారం.

అంటే పెట్టిన బడ్జెట్ 30 కోట్లలో ఆల్ మోస్ట్ 27.50 కోట్ల రికవరీ నాన్ థియేట్రికల్ బిజినెస్ ను సొంతం చేసుకోగా మిగిలిన మొత్తం ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ ద్వారా రాబోతూ ఉండగా మేకర్స్ కి మంచి టేబుల్ ప్రాఫిట్ ఈ సినిమాతో సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక ఈ సినిమాతో శర్వానంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here