ఒక భాషలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా అంటే చాలు ఇతర ఇండస్ట్రీలో ఆ సినిమాను రీమేక్ చేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతాయ్, రొటీన్ మూవీస్ ని పెద్దగా పట్టించుకోరు కానీ ఆ సినిమా క్లాసిక్ అయితే మట్టుకు ఈ సినిమాను తమ ఆడియన్స్ కి కూడా అందించాలి అనుకుంటారు….
నిర్మాతలు కూడా అలాంటి సినిమాలతో డబ్బులు మరింతగా సంపాదించాలని చూస్తారు, కానీ టాలీవుడ్ లో ఓ క్లాసిక్ మూవీ విషయంలో మాత్రం క్లాసిక్ హిట్ గా నిలిచినా కూడా ఇతర భాషల్లో ఎక్స్ లెంట్ రీమేక్ ఆఫర్స్ వచ్చినా కూడా ఆ సినిమాను ఎట్టి పరిస్థితులలో రీమేక్ చేయనివ్వని నిర్ణయం తీసుకున్నాడు…
ఆ నిర్మాత కం హీరోనే కింగ్ నాగార్జున(Nagarjuna)…ఆ సినిమా మరేదో కాదు 2014 టైంలో వచ్చిన క్లాసిక్ మూవీ అయిన మనం(Manam Movie)సినిమా… ఈ సినిమా రిలీజ్ టైం నుండి కూడా ఇతర ఇండస్ట్రీల యాక్టర్స్ ఈ సినిమాను రీమేక్ చేయాలని బాగానే ట్రై చేశారు…
కానీ ఇది లెజెండ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చివరి సినిమా అవ్వడం, అందునా తమ ఫ్యామిలీ మొత్తం ఇందులో నటించడంతో ఇది ఒక తీపి గుర్తుగా నిలిచిపోవాలని ఎట్టి పరిస్థితులలో ఈ సినిమా రీమేక్ లు లాంటివి ఉండవని నాగార్జున చెప్పారు. దాంతో ఇతర ఇండస్ట్రీల వాళ్ళు ఈ క్లాసిక్ రీమేక్ ను మిస్ చేసుకున్నారు…
మధ్య మధ్యలో ఈ సినిమా కాన్సెప్ట్ పోలి కొన్ని సినిమాలు ఇతర భాషల్లో రూపొందించాలని ట్రై చేశారు కానీ స్టార్ కాస్ట్ పెర్ఫెక్ట్ గా సెట్ అవ్వక అవేవి కార్యరూపం అయితే దాల్చలేదు…. హిందీలో భారీ ఎత్తున ఈ సినిమా రీమేక్ కోసం ట్రై చేసినా రీమేక్ కి నో చెప్పడంతో మనం ANR గారి చివరి తీపి గుర్తుగా అలానే నిలిచిపోతుంది అని చెప్పొచ్చు…