Home న్యూస్ మంగళవారం రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

మంగళవారం రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైంలో చిన్న సినిమానే అయినా మంచి ఆసక్తిని ఆడియన్స్ లో క్రియేట్ చేసిన సినిమా మంగళవారం(MangalaVaaram Movie) RX100 డైరెక్టర్ అజయ్ భూపతి మహా సముద్రంతో డిసాస్టర్ కొట్టిన తర్వాత కసితో తీసిన మంగళవారం మంచి బజ్ నే సొంతం చేసుకుంది. ఇక ఆడియన్స్ ముందుకు వచ్చిన సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

స్టోరీ పాయింట్ విషయానికి వస్తే కథ 1990 టైంలో సాగుతుంది…ఊర్లో ఇల్లీగల్ ఎఫైర్స్ పెట్టుకునే జంటల పేర్లు గోడ పై ఎవరో గుర్తు తెలియని వాళ్ళూ రాయడం అలాగే ఆ జంట ప్రతీ మంగళవారం చనిపోవడం జరుగుతుంది. ఆ హత్యల వెనక ఎవరు ఉన్నారో తెలుసుకోవడానికి పోలిస్ అయిన నందితా శ్వేత వస్తుంది. ఆ తర్వాత కథ ఏంటి ఇంతకీ ఈ హత్యలకు పాయల్ రాజ్ పుత్ కి లింక్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

పెర్ఫార్మెన్స్ పరంగా ఇలాంటి రోల్ ఒప్పుకున్నందుకు పాయల్ రాజ్ పుత్ ని మెచ్చుకుని తీరాల్సిందే…తన రోల్ ప్రీ ఇంటర్వెల్ లో ఎంటర్ అవ్వగా సెకెండ్ ఆఫ్ లో కథ మొత్తం తన రోల్ చుట్టూనే తిరగగా ఆ రోల్ కొన్ని చోట్ల హద్దులు దాటినట్లు అనిపించినా అలాంటి రోల్ ఒప్పుకున్నందుకు హీరోయిన్ ని మెచ్చుకోవాల్సిందే… మిగిలిన యాక్టర్స్ లో అజయ్ ఘోష్ బాగా నటించి మెప్పించాడు….మిగిలిన యాక్టర్స్ ఎవరి రోల్స్ లో వాళ్ళు మెప్పించగా…

సినిమా కి మరో మేజర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. వీక్ సీన్స్ కి కూడా ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్… పాటలు కూడా డీసెంట్ గా ఉండగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో కొంచం పడుతూ లేస్తూ సాగినా సీన్స్ వైజ్ బాగా ఆకట్టుకున్నాయి. సెకెండ్ ఆఫ్ అసలు కథ మొదలు అయినా కూడా అక్కడక్కడా సినిమా డ్రాగ్ అయినా క్లైమాక్స్ ఎపిసోడ్ బాగానే మెప్పించింది….

ఇక సినిమాటోగ్రఫీ ఎక్స్ లెంట్ గా ఉండగా విజువల్స్ టాప్ నాట్చ్ అనిపించేలా మెప్పించగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా మెప్పించాయి. ఇక డైరెక్షన్ పరంగా అజయ్ భూపతి ఓవరాల్ గా కొంచం రొటీన్ గా అనిపించే కథనే అనేక డిఫెరెంట్ లేయర్స్ అండ్ జానర్స్ ని టచ్ చేస్తూ చాలా వరకు ఎంగేజింగ్ గా తెరకెక్కించాడు అని చెప్పొచ్చు….

సినిమాలో కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కథ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా సాగడంతో మొత్తం మీద సినిమా కొన్ని చోట్ల డ్రాగ్ అయినా ఓవరాల్ గా ఎండ్ అయ్యే టైంకి ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా మెప్పించింది అని చెప్పొచ్చు…సినిమాలో కోర్ పాయింట్ పాయింట్, పాయల్ రాజ్ పుత్ పెర్ఫార్మెన్స్….

ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్, క్లైమాక్స్ ఎపిసోడ్ లు మేజర్ ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. అలాగే కొంచం నెమ్మదిగా సాగే కథ, ఫస్టాఫ్ కొంచం కథ టేక్ ఆఫ్ కి టైం పట్టడం లాంటివి డ్రా బ్యాక్స్ అని చెప్పొచ్చు… అయినా కూడా సినిమాలో చాలా వరకు సీన్స్ ఆడియన్స్ ను అలరించేలా ఉండటంతో ఓవరాల్ గా సినిమా ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించడం ఖాయమని చెప్పొచ్చు. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here