Home న్యూస్ 100 కోట్ల బ్లాక్ బస్టర్ మార్క్ అంథోని డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్!

100 కోట్ల బ్లాక్ బస్టర్ మార్క్ అంథోని డిజిటల్ రిలీజ్ డేట్ ఫిక్స్!

0

బాక్స్ ఆఫీస్ చాలా టైంగా ఒక మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో కోలివుడ్ యాక్టర్ విశాల్(Vishal) ఒకరు కాగా రీసెంట్ గా విశాల్ నటించిన కొత్త సినిమా మార్క్ అంథోని(Mark Antony) మూవీని రిలీజ్ చేయగా సినిమాకి తమిళ్ లో మంచి టాక్ లభించినా…

తెలుగు లో మిక్సుడ్ టాక్ వచ్చింది, అయినా కూడా ఉన్నంతలో సినిమా తెలుగు లో మంచి కలెక్షన్స్ నే సొంతం చేసుకోగా తమిళ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించి రీసెంట్ గా సినిమా వరల్డ్ వైడ్ గా 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకుని…

విశాల్ కెరీర్ లో మొట్ట మొదటి 100 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్న సినిమాగా నిలిచింది. అలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకున్న మార్క్ అంథోని సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా….

ప్రైమ్ వీడియోలో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ కాబోతుంది. ఈ నెల 13న సినిమా డిజిటల్ రిలీజ్ కానుండగా అన్ని భాషల్లో సినిమా రిలీజ్ కానుందట. తెలుగు లో ఆల్ మోస్ట్ బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా ఫస్ట్ 100 కోట్ల మూవీగా విశాల్ కెరీర్ లో రికార్డ్ కొట్టింది. ఇక డిజిటల్ లో ఏ రేంజ్ లో రచ్చ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here