క్యారెక్టర్ రోల్స్ తో కూడా మంచి ఇంపాక్ట్ ను చూపించగల నటుల్లో ఒకరైన రావు రమేష్(Rao Ramesh) నటించిన లేటెస్ట్ మూవీ మారుతీ నగర్ సుబ్రమణ్యం(Maruthi Nagar Subramanyam Review) డీసెంట్ ప్రమోషన్స్ ను జరుపుకుని ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ ను సినిమా ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే…మధ్య తరగది వ్యక్తి అయిన రావు రమేష్ టీచర్ జాబ్ కి ట్రై చేసినా ఉద్యోగం కొన్ని కారణాల ఆగిపోవడంతో ఇక ఉద్యోగం చేయకుండా ఉంటాడు, దాంతో తన భార్య ఉద్యోగం చేస్తూ ఉండగా తన కొడుకు మాత్రం తానూ అల్లు అరవింద్ కొడుకుని అని నమ్ముతాడు…అలా లైఫ్ సాగిపోతూ ఉండగా…
అనుకోకుండా ఒక రోజు రావు రమేష్ అకౌంట్ లోకి 10 లక్షల అమౌంట్ క్రెడిట్ అవుతుంది…దాంతో ఒక్కసారిగా రావు రమేష్ లో ప్రవర్తనలో వచ్చిన మార్పులు ఏంటి ఆ తర్వాత కథ ఏమయింది అన్నది మిగిలిన కథ… సినిమాకి మేజర్ ప్లస్ అండ్ మైనస్ పాయింట్ రెండూ కూడా సినిమా కథనే అని చెప్పాలి…
మధ్య తరగది వ్యక్తికి సడెన్ గా ఎక్కువ డబ్బు వస్తే ఏం చేస్తాడు అన్నది మంచి కాన్సెప్ట్ అనే చెప్పాలి. అదే టైంలో తన అకౌంట్ లో డబ్బులు ఎవరు వేశారో తెలుసుకోవడం ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ టైం లో ఎంత సులువో అందరికీ తెలిసిందే. కానీ దానిపై డైరెక్టర్ అసలు ఫోకస్ చేయలేదు…
లాజిక్ లు ఏవి కూడా వెతకకుండా చూస్తె పార్టు పార్టులుగా సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ బాగానే ఆకట్టుకుంది అని చెప్పాలి, రావు రమేష్ మరోసారి తనదైన నటనతో ఆకట్టుకోగా కొన్ని సీన్స్ ఓవర్ ది టాప్ అనిపించినా ఓవరాల్ గా తన పాత్రే సినిమాకి ప్రాణం పోసింది…
ఇక ఇంద్రజ రోల్ కూడా బాగా ఆకట్టుకోగా హీరో జస్ట్ ఓకే అనిపించగా హీరోయిన్ కూడా పర్వాలేదు అనిపించగా మిగిలిన యాక్టర్స్ అందరూ పర్వాలేదు అనిపించగా…సంగీతం యావరేజ్ గా అనిపించగా ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పర్వాలేదు అనిపిస్తుంది…
డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా కూడా చూసే ఆడియన్స్ లాజిక్ లు వెతకకుండా చూస్తె మాత్రం ఓవరాల్ గా పర్వాలేదు అనిపించేలా మెప్పించే మూవీనే మారుతీ నగర్ సుబ్రమణ్యం అని చెప్పాలి…కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా లాజిక్స్ వెతకకపొతే ఒకసారి చూసేలా ఉంది కానీ లాజిక్ లు వెతితే మట్టుకు అంత కన్విన్సింగ్ గా అనిపించకపోవచ్చు. ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్…