కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ అయ్యింది, లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సి ఉన్న సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ ఎట్టకేలకు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ లెవల్ లో రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా ఓవర్సీస్ లో ముందుగా ప్రీమియర్ షోలకు కంప్లీట్ చేసుకుని మొదటి టాక్ ఏంటో బయటికి వచ్చేసింది.
ఆ టాక్ ప్రకారం సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ.. కథ పాయింట్ ని పూర్తిగా చెప్పకున్నా విజయ్ సేతుపతి కాలేజ్ స్టూడెంట్స్ ని ఎలా తన అవసరాలను వాడుకుంటూ ఉన్న టైం లో ఆ కాలేజ్ కి ప్రొఫెసర్ గా వచ్చిన హీరో విజయ్ తన స్టైల్ లో…
ఎం చేశాడు అన్నది మొత్తం మీద సినిమా అంటున్నారు. సింపుల్ స్టోరి లైన్ అయినప్పటికీ అడుగడుగునా హీరో ఎలివేషన్ సీన్స్ తో మాస్ ఎలిమెంట్స్ తో ఫ్యాన్స్ ను ఫుల్ సాటిస్ ఫై చేసే విధంగా సినిమా ఆద్యంతం అలరించింది అని అంటున్నారు. లెంత్ కొంచం ఎక్కువ అవ్వడం…
తమిళ్ ఫ్లేవర్ కూడా ఎక్కువగానే ఉండటం లాంటివి కొంచం బోర్ కొట్టించినా సినిమా మాత్రం అంచనాలను అందుకునే రేంజ్ లోనే ఉందని అంటున్నారు. తెలుగు డబ్బింగ్ అండ్ సాంగ్స్ కొంచం సెట్ కాలేదు అనిపించిందని అని, మిగతావి అన్ని కూడా అద్బుతంగా ఉన్నాయని అంటున్నారు. ఇంటర్వెల్ ఫైట్ సీన్ సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అవుతున్న టైం లో ట్రైన్ ఫైట్ అండ్ క్లైమాక్స్ లో విజయ్ సిక్స్ ప్యాక్ ఫైట్…
మేజర్ హైలెట్స్ లో ఒకటిగా నిలుస్తాయని, ఇక కాలేజ్ లో కబడ్డీ ఫైట్ ఇలా చెప్పుకుంటూ పొతే విజయ్ ఎలివేషన్స్ తో సినిమా మొత్తం నిండిపోగా విజయ్ సేతుపతికి కూడా మంచి ఎలివేషన్ సీన్స్ పడ్డాయని అంటున్నారు. లెంత్ కొంచం తగ్గించి ఉంటె సినిమా రేంజ్ ఇంకా…
బాగుండేదని అంటున్నారు, అనిరుద్ సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ మరో లెవల్ లో ఉన్నాయని, ఎలివేషన్ సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది అంటున్నారు. సినిమా మొత్తం చూశాక కొంచం మన జోష్ మూవీ పోలికలు ఉన్నట్లు అనిపించింది అని అంటున్నారు.
ఫైనల్ గా సినిమా కి ఓవర్సీస్ ఆడియన్స్ నుండి హిట్ నుండి సూపర్ హిట్ అనిపించే టాక్ లభిస్తుంది అని చెప్పాలి. ఓవర్సీస్ లో ఉండే క్లాస్ ఆడియన్స్ నుండే హిట్ టు సూపర్ హిట్ అనిపించే రేంజ్ టాక్ వస్తే ఇక్కడ మాస్ జాతర ఖాయమని చెప్పొచ్చు. ఇక రెగ్యులర్ షోలకు సినిమా ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.