Home న్యూస్ చిట్టచివరి రికార్డ్ ఔట్…క్లీన్ స్వీప్ చేసిన ఎన్టీఆర్ టీసర్!

చిట్టచివరి రికార్డ్ ఔట్…క్లీన్ స్వీప్ చేసిన ఎన్టీఆర్ టీసర్!

1613
0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ కొమరం భీమ్ ఎన్టీఆర్ పుట్టిన రోజు కానుకగా రిలీజ్ అవ్వగా అప్పటి నుండి యూట్యూబ్ లో సంచలన రికార్డులతో దుమ్ము దుమారం చేసిన ఈ టీసర్ ఆల్ టైం రికార్డులను సొంతం చేసుకుని టాలీవుడ్ తరుపున అన్ని రికార్డులను తుడిచిపెట్టిన విషయం తెలిసిందే.

కాగా మొదటి 24 గంటల్లో వ్యూస్ రికార్డ్ మిస్ చేసుకున్నా కానీ లైక్స్ అండ్ కామెంట్స్ పరంగా కొత్త రికార్డులు నమోదు చేసిన ఈ టీసర్ తర్వాత లాంగ్ రన్ లో టాలీవుడ్ తరుపున హైయెస్ట్ లైక్స్ అండ్ కామెంట్స్ ని సొంతం చేసుకుని 1 మిలియన్ మార్క్ ని అందుకుని…

బిగ్గెస్ట్ రికార్డులను సెట్ చేయగా వ్యూస్ పరంగా మాత్రం హైయెస్ట్ వ్యూస్ రికార్డ్ ను రామ్ చరణ్ ఇంట్రో టీసర్ సొంతం చేసుకుని లీడ్ ని కొనసాగించగా ఎట్టకేలకు రీసెంట్ గా మిగిలిన్ ఉన్న చిట్టా చివరి రికార్డ్ ను కూడా ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ బ్రేక్ చేసి టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్ ని…

సొంతం చేసుకున్న టీసర్ గా కూడా నిలిచి మరో బెంచ్ మార్క్ ని సెట్ చేసి పెట్టింది. మొత్తం మీద 38.5 మిలియన్స్ వరకు వ్యూస్ ని సొంతం చేసుకుని, రామ్ చరణ్ ఇంట్రో టీసర్ నెలకొల్పిన 38.3 మిలియన్స్ రికార్డ్ ను బ్రేక్ చేసి ప్రస్తుతం టాప్ లో కొనసాగుతుంది, దాంతో ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని 2 ఇంట్రో టీసర్ లు ఇప్పుడు టాలీవుడ్ తరుపున హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ లు గా…

బిగ్గెస్ట్ రికార్డ్ ను సొంతం చేసుకున్నాయి. ఇంకా సినిమా మెయిన్ టీసర్ అండ్ ట్రైలర్ లు రిలీజ్ అవ్వాల్సి ఉండగా అవి రిలీజ్ అయ్యే టైం కి మరెలాంటి రికార్డులను నమోదు చేస్తాయో చూడాలి. ప్రస్తుతానికి ఎన్టీఆర్ టీసర్ టీసర్ ల పరంగా అన్ని రికార్డులను క్లీన్ స్వీప్ చేసి దుమ్ము లేపింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here