బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి ఓ భారీ హిట్ కోసం ట్రై చేస్తున్న సందీప్ కిషన్ అప్పుడప్పుడు కొన్ని పర్వాలేదు అనిపించే సినిమాలతో మెప్పించినా ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న భారీ హిట్ అయితే సొంతం కాలేదు. ఇప్పుడు తన కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బడ్జెట్ తో మైఖేల్ అనే భారీ యాక్షన్ మూవీతో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేశాడు. టీసర్ ట్రైలర్ లు ఇంప్రెస్ చేయగా వరల్డ్ వైడ్ గా ఉన్నంతలో భారీగానే రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉంది, ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ…
ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే… గ్యాంగ్ స్టర్ అయిన గౌతమ్ మీనన్ దగ్గర చిన్నప్పటి నుండి పెరిగిన హీరో ఆ గ్యాంగ్ స్టర్స్ లో ఒకరిగా పెరుగుతాడు, తర్వాత అందరిలోకి మోస్ట్ వాంటెడ్ గా ఎదిగిన హీరోని చూసి వరుణ్ సందేశ్ తనకి నచ్చదు… ఇలా సాగుతున్న హీరో లైఫ్ లోకి హీరోయిన్ ఎంట్రీ తర్వాత ఎలాంటి పరిణామాలు ఏర్పడ్డాయి తర్వాత ఏం జరిగింది, విజయ్ సేతుపతి, వరలక్ష్మీల రోల్స్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
కథ పాయింట్ మనం ఎప్పటి నుండో చూస్తున్నదే, కానీ అందులో ఏమాత్రం బలం లేదు, పైపెచ్చు చాలా వరకు సీన్స్ హాలీవుడ్ మూవీ జాన్ విక్ ని పోలి ఉంటాయి…. కానీ ఇక్కడ కథలో పెద్దగా దమ్ము లేకపోవడంతో జాన్ విక్ రేంజ్ యాక్షన్ ఇందులో కూడా బాగా ఇంప్రెస్ చేసినా కథ ఆడియన్స్ కి ఏమాత్రం కనెక్ట్ అయ్యే విధంగా లేదు… సందీప్ కిషన్ ఎప్పటి లానే మరో సారి తన పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకున్నాడు. ఎలివేషన్ సీన్స్ బాగానే ఇంప్రెస్ చేశాయి. హీరోయిన్ రోల్ సినిమాకి మైనస్, గౌతమ్ మీనన్ రోల్ పర్వాలేదు, వరుణ్ సందేశ్ రోల్ జస్ట్ ఓకే, విజయ్ సేతుపతి రోల్ చాలా చిన్నది, మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు…
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే నాసికరంగా ఉండగా విజువల్స్, ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ సినిమాకి హైలెట్ పాయింట్స్… దానికి తోడూ బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా సీన్స్ లో బాగా ఇంప్రెస్ చేస్తుంది.. యాక్షన్ మూవీ లవర్స్ కి సినిమా లో యాక్షన్ సీన్స్ బాగా నచ్చే అవకాశం ఉంటుంది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే…90’s టైం యాక్షన్ సగా అంటూ తెరకెక్కిన మైఖేల్ కేవలం యాక్షన్ లవర్స్ కి నచ్చే కథతోనే తెరకెక్కింది… సినిమాలో ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాల్సిన లవ్ స్టొరీనే మేజర్ మైనస్ పాయింట్ గా నిలవడం, ఫస్టాఫ్ టేక్ ఆఫ్ అయినట్లే అయ్యి లవ్ స్టొరీ వలన ట్రాక్ తప్పడం తర్వాత ఇంటర్వెల్ వరకు పడుతూ లేస్తూ సాగిన కథ…
సెకెండ్ ఆఫ్ లో కొంచం బెటర్ గా సాగుతుంది, కానీ క్లైమాక్స్ లో మళ్ళీ ఇలా చేశారే అనిపించేలా ముగిసే సినిమా ఎండ్ క్రెడిట్ సీన్స్ తో సీక్వెల్ కూడా ఉంటుందని చెబుతారు… ఓవరాల్ గా సినిమా యాక్షన్ మూవీస్ ని ఇష్టపడే ఆడియన్స్ అయితే లవ్ స్టొరీని తట్టుకుని కూర్చుంటే సినిమా పర్వాలేదు అనిపించేలా మెప్పిస్తుంది, ఇక రెగ్యులర్ మూవీ లవర్స్ అయితే ఈ యాక్షన్ ని ఆ లవ్ స్టొరీని తట్టుకోవడం కొంచం కష్టమే… మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్…