లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో దూసుకు పోతున్న కీర్తి సురేష్ రీసెంట్ టైం లో పెంగ్విన్ సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేయగా ఇప్పుడు మిస్ ఇండియా సినిమాను కూడా డైరెక్ట్ రిలీజ్ చేశారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళు అందరూ కూడా సినిమాలో మెయిన్ కథ పాయింట్ అయిన అమెరికాలో ఛాయ్ బిజినెస్ థాట్ చాలా బాగున్నా కానీ సినిమా ను ఓవరాల్ గా బాగా తీయలేక పోయారు….
అంటూ సినిమా ఏమాత్రం బాలేదని చెప్పారు, కానీ సినిమా కి నెట్ ఫ్లిక్స్ మాత్రం సాలిడ్ గా వ్యూస్ దక్కగా, ఇప్పుడు సినిమా గురించిన మరో న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది, ఆ న్యూస్ ప్రకారం సినిమా కథ పాయింట్ ను కూడా వేరే రియల్ లైఫ్ స్టొరీ నుండి…
ఇన్స్పైర్ అయ్యి కాపీ కొట్టి తీశారని విమర్శలు వస్తున్నాయి… ఓ అమెరికన్ యువతి బ్రూక్ ఎడ్డీ జీవిత చరిత్రతో తెరకెక్కిన సినిమా అని చెప్పుకుంటున్నారు అందరూ… ఇండియన్ ఛాయ్‌ని ‘భక్తి ఛాయ్’ పేరుతో ఆమె అమెరికా దేశమంతా పాపులర్ అయ్యేలా ఎంతో కష్టపడి బిజినెస్ లో ఎదిగింది అంట…
ఇండియా కి వచ్చినప్పుడు నార్త్ ఇండియా మొత్తం ట్రావెల్ చెయ్యాల్సి వచ్చిందట. అప్పుడు ఆమెకు ఛాయ్ అంటే ఇష్టం పెరిగి ఛాయ్ ని అమెరికాలో బిజినెస్ చేయాలనీ ఫిక్స్ అయ్యి 2007 లో బిజినెస్ ను మొదలు పెట్టగా 2018 వరకూ 35 మిలియన్ డాలర్ల సంపదని సొంతం చేసుకున్న బ్రూక్ ఎడ్డీ లైఫ్ స్టొరీ ని ఇన్స్పైర్ అయ్యి ఆమె మీద కథ ను రాసుకుని…
ఈ కథని సిద్ధం చేశారు అంటున్నారు, ఈమె పై కొన్ని షార్ట్ స్టోరీస్ చాలానే ఇంటర్ నెట్ లో ఉండగా వాటిని చూసే ఈ కథని సిద్ధం చేసుకున్నారు అంటున్నారు ఇప్పుడు, ఏది ఏమైనా కానీ కథ ఇన్స్పైర్ అయ్యారో లేక కాపీ కొట్టారో కానీ సరిగ్గా డీల్ చేసి ఉంటే బాగుండేది కానీ సినిమా టేకింగ్ బాలేక పోవడం తో ఈ విధంగా కూడా విమర్శలను ఎదురుకుంటుంది ఈ సినిమా…