అఖిల్ అక్కినేని నటించిన మూడో సినిమా మిస్టర్ మజ్ను రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు మంచి అంచనాల నడుమ వచ్చేయగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ కొద్దిగా స్లో గా ఓపెన్ అవ్వడం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో స్టార్ట్ ని సొంతం చేసుకుంది, కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోల కి అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లి మెల్లి గా పుంజుకోవడం తో సినిమా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా పర్వాలేదు అనిపించడం ఖాయం అని అంటా భావించారు. సినిమా కూడా మరీ ఆ రేంజ్ లో కాకున్నా…
బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ని చోట్లా మంచి గ్రోత్ నే సాధించినప్పటికీ అది మరీ అనుకున్న రేంజ్ లో అయితే లేదనే చెప్పాలి, ముఖ్యంగా బి సి సెంటర్స్ లో మాత్రం జస్ట్ ఓకె అనిపించుకునే ఓపెనింగ్స్ ని మాత్రమె సొంతం చేసుకో గలిగింది అని చెప్పాలి.
ఆ ఎఫెక్ట్ తొలిరోజు కలెక్షన్స్ పై పడినప్పటికీ ఈవినింగ్ అండ్ నైట్ షోల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కొంచం ఇంప్రూవ్ అవ్వడం తో టోటల్ గా సినిమా మొదటి రోజు మొత్తం మీద 35 టు 40 % లోపు ఆక్యుపెన్సీ ని సాధించింది. దాంతో తొలిరోజు కలెక్షన్స్ పరంగా సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుగా అనుకున్నట్లు గానే 2.3 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉంది, అది కూడా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ సెకెండ్ షో లకు అనుకున్న రేంజ్ లో ఉంటే నే అని చెప్పాలి. ఒక సేల్స్ మరింతగా…
పెరిగితే సినిమా కలెక్షన్స్ 2.5 కోట్ల మార్క్ ని అధిగమించవచ్చు, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిరోజు కి గాను 3.5 కోట్ల నుండి 3.7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.