Home న్యూస్ మిస్టర్ మజ్ను ఇదే ఫైనల్…ఫైనల్ టాక్ ఇదే

మిస్టర్ మజ్ను ఇదే ఫైనల్…ఫైనల్ టాక్ ఇదే

1

     అఖిల్ మరియు హలో సినిమాల తర్వాత అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మిస్టర్ మజ్ను. బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా తొలి రెండు సినిమాల మాదిరిగానే పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకోగా ఓవర్సీస్ ఆడియన్స్ నుండి ఫైనల్ గా పర్వాలేదనిపించే టాక్ ని, తర్వాత రెగ్యులర్ షోల నుండి కూడా ఇదే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకోగా ఇప్పుడు ఫ్యామిలీ అండ్ కామన్ ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ని సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారింది.

కాగా సినిమా ఫ్యామిలీ అండ్ కామన్ ఆడియన్స్ నుండి కూడా ఇదే విధమైన టాక్ ని సొంతం చేసుకుంది అని చెప్పాలి. వారు మొదటి అర్ధ భాగాన్ని బాగానే ఎంజాయ్ చేసిన లవ్ స్టొరీ ఎమోషనల్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ కి కొంత బోర్ కొట్టాయి అని అంటున్నారు.

ఇక ఓవరాల్ మూవీ పరంగా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ ఫస్టాఫ్ ఉన్నంత బాగా సెకెండ్ ఆఫ్ లేదని ఎమోషనల్ సన్నివేశాలు బాగానే ఉన్నా అవి పెద్దగా కనెక్ట్ కాలేదని అంటున్నారు. ఫైనల్ గా ఒకసారి చూడొచ్చు అని చెబుతుండగా, కామన్ ఆడియన్స్ కూడా…

ఫస్టాఫ్ లో ఉన్నంత గ్రిప్పింగ్ గా స్క్రీన్ ప్లే సెకెండ్ ఆఫ్ లో మిస్ అయిందని,  దర్శకుడు సెకెండ్ ఆఫ్ మొదటి 35 నిమిషాలను మరింత బాగా డీల్ చేసి ఉంటె పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అయ్యేదని అంటున్నారు, కానీ అఖిల్ కోసం ఫైనల్ గా ఒకసారి చూడొచ్చు…

అని చెబుతున్నారు కామన్ ఆడియన్స్, మొత్తం మీద అఖిల్ మొదటి రెండు సినిమాల రేంజ్ టాక్ నే సొంతం చేసుకున్నా కమర్షియల్ ఎలిమెంట్స్ కొంచం ఎక్కువగా ఇందులో ఉండటం అందుకోవాల్సిన టార్గెట్ కూడా తక్కువే అవ్వడం తో సినిమా మొదటి రెండు సినిమాల మాదిరిగా కలెక్షన్స్ అందుకుంటే బ్రేక్ ఈవెన్ కి చేరువ అవ్వొచ్చు అని చెప్పాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here