ఈ ఇయర్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మూవీస్ లిస్టులో ఒకటిగా నిలిచిన సినిమాల్లో సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న మూవీ నారప్ప కూడా ఒకటి. తమిళ్ లో ధనుష్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అసురన్ సినిమా తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ సినిమా పై ఆడియన్స్ లో అంచనాలు బాగానే ఉన్నాయు. ఒరిజినల్ చూసిన వాళ్ళు వెంకీ ఏ రేంజ్ లో ఆ రోల్ ని…
ఓన్ చేసుకుంటారో చూడాలని, అసురన్ చూడని వాళ్ళు ఓ రా రస్టిక్ మాస్ మూవీ లో వెంకీ ని ఎప్పటి నుండో చూడాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలా మంచి అంచనాలను క్రియేట్ చేసిన నారప్ప సినిమా ఆడియన్స్ ముందుకు మే నెలలోనే రావాల్సింది కానీ….
సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన సినిమా ఆడియన్స్ ముందుకు మరింత ఆలస్యం కాబోతుందని మేకర్స్ తెలియజేశారు. దాంతో సినిమా కంప్లీట్ అయ్యింది అన్న విషయం తెలుసుకుని సినిమాను డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ చేయించాలని OTT వాళ్ళు తెగ ట్రై చేశారు కానీ.. మేకర్స్ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలనీ భావించారు.
దాంతో ముందు అమ్మం అంటూనే ఇప్పుడు సినిమాను డిజిటల్ రిలీజ్ కి ఓకే చెప్పారని తెలుస్తుంది. సినిమా డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు 36 కోట్ల భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినా ఇంత బిజినెస్ జరిగే అవకాశం తక్కువే అని చెప్పాలి. ఈ రేంజ్ రేటు సొంతం చేసుకున్న నారప్ప సినిమాను…
జులై 24 న అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుందని అంటున్నారు. దీని వెనక అసలు కారణం థియేటర్స్ రీ ఓపెన్ అయితే ఆ నెలలో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు సమ్మర్ నుండి పెండింగ్ ఉన్న సినిమాల వలన రిలీజ్ డేట్స్ ఇబ్బందులు వస్తాయి కాబట్టి కొన్ని సినిమాలు ఇలా డిజిటల్ రిలీజ్ చేయడం ఉత్తమం అని ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.