యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో దుమ్ము లేపారు, లాక్ డౌన్ కొనసాగుతున్న కారణంగా అందరు హీరోల ఫ్యాన్స్ ఎదో ఒక ట్రెండ్ తో బిజీ గా ఉండగా రోజు కో సినిమా ట్రెండ్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. దాంతో టాప్ హీరోల సినిమాల యానివర్సరీ ట్రెండ్స్ సోషల్ మీడియా లో ప్రతీ రోజు ఎదో ఒక రచ్చ చేస్తూ నే ఉండగా ఇప్పుడు టైర్ 2 హీరోల వంతు వచ్చింది.
రీసెంట్ టైం లో టైర్ 2 హీరోల్లో నాగ చైతన్య ఫ్యాన్స్ నాని ఫ్యాన్స్ ఎం.సి.ఏ సినిమా తో నెలకొల్పిన ట్రెండ్ రికార్డ్ ను నా చైతన్య కెరీర్ బెస్ట్ మూవీ మజిలి ట్రెండ్ తో బ్రేక్ చేయగా తర్వాత నాని ఫ్యాన్స్ నాని కెరీర్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ మూవీ అయిన జెర్సీ….
ట్రెండ్ తో మజిలీ రికార్డ్ ను బ్రేక్ చేశారు. కాగా ఇప్పుడు నాగ చైతన్య ఫ్యాన్స్ మళ్ళీ సోషల్ మీడియా లో రెచ్చిపోయి నాని ఫ్యాన్స్ రికార్డ్ ను బ్రేక్ చేశారు, నాగ చైతన్య కెరీర్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటైన 100% లవ్ వచ్చి…
9 ఏళ్ళు పూర్తీ అయిన సందర్భంగా సోషల్ మీడియా లో ట్రెండ్ చేపట్టిన ఫ్యాన్స్ 24 గంటలు పూర్తీ అయ్యే సరికి సుమారు 4 లక్షల 1 వేయి కి పైగా ట్వీట్ ని నమోదు చేసి ఆల్ టైం రికార్డ్ టైర్ 2 ట్రెండ్ ని నమోదు చేసి సంచలనం సృష్టించారు. ఒక సారి టాప్ టైర్ 2 హీరోల యానివర్సరీ ట్రెండ్స్ ని గమనిస్తే…
#9YearsFor100PercentLove- 401.6K***
#1YearforClassicJERSEY – 391.6K
#1YearForCultClassicMajili – 184.2K
#2YearsForMCA – 153K
#8YearsForEvergreenPJ – 76K
అలాగే టాలీవుడ్ లో బిగ్గెస్ట్ యానివర్సరీ ట్రెండ్స్ లో కూడా ప్రస్తుతానికి టాప్ 10 ట్రెండ్ గా నిలిచి సంచలనం సృష్టించారు. ఇక ఇప్పుడు నాని ఫ్యాన్స్ నిన్నుకోరి ట్రెండ్ తో ఈ రికార్డ్ క్రాస్ చేస్తామని ధీమాగా ఉన్నారు, మరి బ్రేక్ చేస్తారో లేదో చూడాలి.