యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య సాయి పల్లవి ల కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ, లాస్ట్ ఇయర్ సమ్మర్ కానుకగా రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా అప్పటి నుండి కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూనే ఉండగా ఈ సమ్మర్ లో అయినా రిలీజ్ అవుతుంది అనుకుంటే సరిగ్గా రిలీజ్ టైం కి సెకెండ్ వేవ్ ఎంటర్ అవ్వడం తో…
సినిమా రిలీజ్ ను ఆపేశారు… పరిస్థితులు నార్మల్ అయ్యాకే సినిమా ఆడియన్స్ ముందుకు వస్తుందని కన్ఫాం చేశారు. ఇక మేకర్స్ కి సినిమా డిజిటల్ రిలీజ్ కోసం అద్బుతమైన ఆఫర్స్ వస్తూనే ఉన్నప్పటికీ కూడా వేటికి కూడా ఓకే చెప్పలేదు మేకర్స్… ఒక స్టేజ్ లో తెలుగు లో హైయెస్ట్ రేటు ని…
సొంతం చేసుకున్న సినిమాగా కూడా నిలిచినా ఈ సినిమా ను అమ్మడానికి సిద్ధం కాలేదు. కానీ రీసెంట్ గా సినిమా డిజిటల్ రైట్స్ హక్కులను తెలుగు OTT టాపర్ ఆహా వీడియో వాళ్ళు ఫ్యాన్సీ రేటు చెల్లించి సొంతం చేసుకోగా సినిమా కమింగ్ సూన్ అంటూ చెప్పారు.
దాంతో సినిమా పెద్ద పెద్ద ఆఫర్స్ కి నో చెప్పి ఇప్పుడు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను ఆహా వీడియో లో సొంతం చేసుకోబోతుందా అనే అనుమానాలు మొదలు అవ్వగా ఈ మధ్యే ఆహా వీడియో వాళ్ళు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిలీజ్ అయ్యాకే ఆహా లో వస్తుందని తెలియజేశారు. కానీ అసలు ట్విస్ట్ తర్వాతే ఉండబోతుంది. క్రాక్ సినిమా రిలీజ్ అయిన…
రెండు వారాల తర్వాత డిజిటల్ రిలీజ్ అవ్వాల్సింది ప్రెజర్ వలన 3 వారాలకు అయింది. కానీ లవ్ స్టొరీ థియేటర్స్ లో రిలీజ్ అయిన రెండు వారాలకే డిజిటల్ రిలీజ్ అవుతుందని, ఆ అగ్రిమెంట్ తోనే సినిమాను కొన్నారని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందీ అన్నది త్వరలోనే మరింత క్లారిటీ రానుంది.