నాచురల్ స్టార్ నాని సెన్సేషనల్ కంబ్యాక్ మూవీ జెర్సీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో ఓపెన్ అయింది, నిన్నటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ యావరేజ్ గా ఉన్నా కానీ ఈ రోజు మొదటి షో సమయానికి వచ్చే సరికి బుకింగ్స్ స్టేటస్ ఊహించని లెవల్ లో పెరిగి దుమ్ము లేపింది, సినిమా నిన్నటి వరకు బుకింగ్స్ 35% వరకు ఉండగా మార్నింగ్ షో సమయానికి 40% వరకు వెళుతుంది అనుకున్నా కానీ..
ఇప్పుడు ఏకంగా 50% కి పైగా బుకింగ్స్ తో ఊచకోత కోసింది జెర్సీ సినిమా, దాంతో ఇప్పుడు మొదటి రోజు కలెక్షన్స్ పరంగా జెర్సీ ఊహించని భీభత్సం సృష్టించే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు, ముందుగా ఓపెనింగ్స్ ని బట్టి 4.5 కోట్ల రేంజ్ షేర్ పక్కా అనుకున్నా…
ఇప్పుడు బుకింగ్స్ చూస్తుంటే తొలిరోజు 5 నుండి 6 కోట్ల రేంజ్ షేర్ ని అందుకున్నా ఆశ్యర్యపోనవసరం లేదని చెప్పొచ్చు. కానీ ఇది ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ పై కూడా డిపెండ్ అయ్యి ఉందని చెప్పాలి. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ గ్రోత్ బాగుంటే ఈ లెక్క మరింత పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పాలి.