విక్టరీ వెంకటేష్ సోలో హీరోగా కొంత గ్యాప్ తర్వాత నటించిన లేటెస్ట్ మూవీ నారప్ప ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ అయ్యి వచ్చిన విషయం తెలిసిందే. సినిమా ఆడియన్స్ ముందుకు థియేటర్స్ లో సమ్మర్ కానుకగా రావాల్సింది కానీ సెకెండ్ వేవ్ వలన రిలీజ్ కి అడ్డంకి ఏర్పడగా ఇప్పుడు సెకెండ్ వేవ్ తగ్గిన తర్వాత అయినా థియేటర్స్ లో రిలీజ్ చేస్తారు అనుకున్నా కానీ మేకర్స్ సినిమాను…
అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ రిలీజ్ చేశారు… ఈ సినిమా నిర్మాత అయిన సురేష్ బాబు మేం ఒక్కరమే ఈ సినిమాను నిర్మించినట్లు అయితే డిజిటల్ రిలీజ్ చేయక పోయే వాళ్ళం అని కానీ సినిమా కి మరో నిర్మాతగా ఉన్న కలైపులి థాను రీసెంట్ గా నిర్మించిన కర్ణన్ సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన పరుగు మధ్యలోనే ఆపడం తో ఆల్ మోస్ట్ 15 కోట్ల వరకు నష్టపోవాల్సి వచ్చిందని ఆయనే డిజిటల్ రిలీజ్ చేస్తామని ప్రైమ్ వాళ్ళతో డీల్ మాట్లాడారు అని కన్ఫాం చేయగా సినిమా ఓవరాల్ గా డిజిటల్ రిలీజ్ కి గాను…
సెన్సేషనల్ అనిపించే విధంగా 40 కోట్ల మమ్మోత్ రేటు ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సినిమా ఓవరాల్ బడ్జెట్ వెంకటేష్ రెమ్యునరేషన్ తో కలిపి 23 కోట్ల లోపే పూర్తీ అయిందని అంటున్నారు. అంటే కేవలం డిజిటల్ రైట్స్ కే సినిమా బడ్జెట్ మీద 17 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేయగా ఇంకా తెలుగు శాటిలైట్ రైట్స్ అలాగే…
హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ లాంటివి ఉండటం తో ఓవరాల్ గా సినిమా కి అల్టిమేట్ ప్రాఫిట్స్ రావడం ఖాయం, ఆ ప్రాఫిట్స్ తో ఆల్ మోస్ట్ కలైపులి థాను లాస్ మొత్తం కవర్ అవ్వడం ఖాయమని అంటున్నారు ఇప్పుడు… వేరే సినిమా లాస్ మొత్తాన్ని ఇప్పుడు నారప్ప రికవరీ చేస్తూ లాభాలను కూడా సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం అనే చెప్పాలి.