ఫ్యామిలీస్ లో ఇప్పటికీ చెక్కుచెదరని క్రేజ్ ను అలానే మెయిన్ టైన్ చేస్తున్న విక్టరీ వెంకటేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ టైం లో మంచి ఫాం లో దూసుకు పోతున్నాడు, ఎక్కువగా మల్టీ స్టారర్ మూవీస్ నే చేసినా కానీ ఆ సినిమాల విజయాలలో వెంకీ దే కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు వరుస పెట్టి కొత్త సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్న విక్టరీ వెంకటేష్ ఈ ఇయర్ లో…
ఏకంగా 3 సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు, ముందు అసురన్ రీమేక్ నారప్ప, తర్వాత దృశ్యం 2 సినిమా తర్వాత ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 మూవీస్ తో సందడి చేయబోతుండగా సడెన్ గా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన కొత్త సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ కూడా..
వరుస పెట్టి పోస్ట్ పోన్ లు అవుతున్న వేల వెంకటేష్ నారప్ప సినిమా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ అయ్యింది, మే 14 న రిలీజ్ ను అనౌన్స్ చేసిన ఈ సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వడం తో డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కోసం ఆఫర్స్ మొదలు అయ్యాయని తెలుస్తుంది.
లీడింగ్ OTT యాప్స్ ఈ సినిమా రైట్స్ కోసం మంచి మంచి ఆఫర్స్ ఇస్తున్నారని తెలుస్తుంది, లేటెస్ట్ గా అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఈ సినిమా హక్కుల కోసం ఏకంగా 35 కోట్ల భారీ రేటు ఆఫర్ చేశారని సమాచారం. ఇది రీసెంట్ టైం లో తెలుగు లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ ఆఫర్స్ లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కానీ మేకర్స్ ముందు థియేటర్స్ లో రిలీజ్ కే ప్రయత్నాలు చేస్తున్నారు.
పరిస్థితులు మరీ సెట్ కాక పొతే తప్పితే డిజిటల్ రిలీజ్ కి మొగ్గు చూపే అవకాశం తక్కువే అని అంటున్నారు. ఈ లోపు ఇంకా బెటర్ ఆఫర్ వస్తే అప్పుడు డైరెక్ట్ రిలీజ్ పై ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండొచ్చని కూడా టాక్ ఉంది. మరి మేకర్స్ ఈ సినిమా పై ఫైనల్ గా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి ఇక.