విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ నారప్ప బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వాల్సిన క్రేజీ మూవీ కానీ అలా కాకుండా ఆడియన్స్ ముందుకు అమెజాన్ ప్రైమ్ లో రాగా అక్కడ వచ్చినా కూడా సెన్సేషనల్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ దుమ్ము లేపుతున్న ఈ సినిమా ఓవరాల్ గా వేరే సినిమా నష్టం వలన ఈ సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేశాం అన్నారు కానీ… ఇప్పుడు ఈ సినిమా…
ఆ సినిమా నష్టాలను తీర్చేసి అద్బుతమైన లాభాలతో దుమ్ము లేపుతున్న విషయం తెలిసిందే. ఆల్ రెడీ డిజిటల్ రైట్స్ కోసం 40 కోట్ల మమ్మోత్ రేటు ని సొంతం చేసుకున్న నారప్ప సినిమా అప్పటికే బడ్జెట్ మీద సాలిడ్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది.
ఇక సినిమా తర్వాత ఇప్పుడ శాటిలైట్ రైట్స్ కూడా భారీ రేటు కి అమ్ముడు పోయాయని లేటెస్ట్ టాలీవుడ్ టాక్. లీడింగ్ ఛానెల్ అయిన జెమినీ టీవీ వాళ్ళు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని ఏకంగా 9.5 కోట్ల రేటు చెల్లించి సొంతం చేసుకున్నారని టాలీవుడ్ ట్రేడ్ లో వార్తలు వస్తున్నాయి.
ఓ సీనియర్ సినిమా కి ఈ రేంజ్ రేటు అంటే వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ క్రేజ్ కి ఇది నిదర్శనం అని చెప్పొచ్చు ఇప్పుడు. ఈ రేంజ్ శాటిలైట్ రైట్స్ డీల్ తో సినిమా అతి త్వరలోనే టెలివిజన్ లో కూడా టెలికాస్ట్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని లేటెస్ట్ సమాచారం. ఇప్పటికే సాలిడ్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న నారప్ప సినిమా కి ఇంకా…
హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ ఉండనే ఉన్నాయి కాబట్టి అవి కూడా యాడ్ అయితే మరిన్ని లాభాలను ఈ సినిమా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా బడ్జెట్ మీద ఓ రేంజ్ లో ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంటున్న నారప్ప సినిమా నిర్మాతలను ఇప్పుడు లాభాల్లో ముంచెత్తుతుంది అని చెప్పాలి.