Home న్యూస్ అసలే చెక్ డిసాస్టర్…అయినా నితిన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటి?

అసలే చెక్ డిసాస్టర్…అయినా నితిన్ ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడేంటి?

0

యూత్ స్టార్ నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో లాస్ట్ ఇయర్ భీష్మ సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు, కానీ ఆ హిట్ ట్రాక్ ని అలాగే చెక్ మూవీ తో కొనసాగించాలి అనుకున్నా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా పరుగును ముగించింది. సినిమా ఫ్లాఫ్ కి కారణాలు…

అనేకం ఉన్నా కానీ ప్రమోషన్స్ పెద్దగా చేయక పోవడం అండ్ భారీ టికెట్ హైక్స్ ఒక ఎక్స్ పెరిమెంటల్ మూవీ కి పెట్టడం లాంటివి గట్టి ఎదురుదెబ్బ కొట్టి బాక్స్ ఆఫీస్ దగ్గర బిజినెస్ రికవరీ చేయలేక పోవడానికి ముఖ్య కారణాలు గా నిలిచాయి. కానీ టికెట్ హైక్స్ వలన…

ఎక్కువ ఇంపాక్ట్ చూపి కామన్ ఆడియన్స్ థియేటర్స్ కి కూడా రాకుండా చేసింది, కానీ ఈ భారీ హైక్స్ నుండి ఇప్పుడు రంగ్ దే టీం ఏమి గ్రహించలేదు అని తెలుస్తుంది, ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర రంగ్ దే సినిమా కూడా భారీ టికెట్ హైక్స్ తో రిలీజ్ కాబోతుంది….

సింగల్ స్క్రీన్స్ లో 110 నుండి 150 వరకు, మల్టీ ప్లేక్స్ లో 200 నుండి 300 వరకు టికెట్ రేటు తో సినిమా రిలీజ్ కానుంది. చెక్ ఎక్స్ పెరిమెంటల్ మూవీ కాబట్టి టికెట్ హైక్స్ వలన కామన్ ఆడియన్స్ థియేటర్స్ కి తరలి రాలేదు కానీ రంగ్ దే ఫ్యామిలీ డ్రామా కాబట్టి వస్తారు అని రేట్లు పెంచారు కానీ ఫ్యామిలీస్ ఇంతింత రేటు పెట్టి థియేటర్స్ కి…

వస్తారో రారో అన్న డౌట్ ఎంతైనా ఉంది… ఇలా టికెట్ హైక్స్ సినిమా కి ఓపెనింగ్స్ తెస్తాయేమో కానీ లాంగ్ రన్ పై ఇంపాక్ట్ కచ్చితంగా చూపుతాయి, మరి రంగ్ దే సినిమా విషయం లో ఇది ప్లస్ అయ్యి లాంగ్ రన్ లో కూడా హెల్ప్ అవుతుందా లేక చెక్ లాగా బాక్ ఫైర్ అవుతుందా అన్నది మాత్రం సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here