బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ లో మాస్ హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో అఖిల్ అక్కినేని ఒకరు, 2021 లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో కెరీర్ లో మొదటి హిట్ ని సొంతం చేసుకున్న అఖిల్ ఆ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఏజెంట్ మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అప్పటి నుండి సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా లాస్ట్ ఇయర్…
రిలీజ్ చేసిన సినిమా ఫస్ట్ గ్లిమ్స్ టీసర్ కి రెస్పాన్స్ నెక్స్ట్ లెవల్ లో వచ్చింది, అందరిలోనూ సినిమా మీద అంచనాలు పెరిగి పోయాయి, బిజినెస్ ఆఫర్స్ కోట్ల రేటు పలికింది, కానీ రిలీజ్ దగ్గర పడ్డ టైంలోనే బిజినెస్ చేయాలనీ మేకర్స్ డిసైడ్ అవ్వగా ఇప్పుడు రిలీజ్ కి..
అటూ ఇటూగా 2 వారాల టైం ఉండగా సినిమా నుండి టీసర్ తర్వాత వచ్చిన కంటెంట్ ఏమి కూడా అనుకున్న రేంజ్ లో బజ్ ను క్రియేట్ చేయలేదు, 2 సాంగ్స్ రిలీజ్ అవ్వగా మినిమమ్ ఇంపాక్ట్ ని కూడా చూపించలేదు. ఇక మూడో సాంగ్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆ సాంగ్ కూడా బజ్ ను…
మరింతగా తగ్గించడంతో ముందు వచ్చిన భారీ ఆఫర్స్ అన్నీ ఇప్పుడు తగ్గిపోయి ఆంధ్ర సీడెడ్ లాంటి ఏరియాల్లో చాలా తక్కువ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయట. ముందు ఆంధ్ర సీడెడ్ లు కలిపి 30 కోట్ల బిజినెస్ అనుకుంటే ఇప్పుడు 15-17 కోట్ల ఆఫర్స్ కూడా కష్టంగా వస్తున్నాయని తెలుస్తుంది. దాంతో టీం సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే అన్నీ సద్దుకుని తిరిగి బజ్ ఏర్పడుతుందని ఆశిస్తున్నారు.