Home గాసిప్స్ 9 ఏళ్ళుగా ఒక్క హిట్ లేదు…అయినా ఇన్ని సినిమాలు ఏంటి సామి!!

9 ఏళ్ళుగా ఒక్క హిట్ లేదు…అయినా ఇన్ని సినిమాలు ఏంటి సామి!!

0

కెరీర్ మొదలు పెట్టడం కొందరు హిట్స్ తో మొదలు పెట్టినా తర్వాత ఆ హిట్స్ జోరు ని అలానే మెయిన్ టైన్ చేయడం కొందరి వల్లే అవుతుంది, చాలా మంది హీరోలు మొదట్లో హిట్స్ కొట్టినా తర్వాత వరుస పెట్టి ఫ్లాఫ్స్ ను ఎదురుకుంటూ కెరీర్ లో పూర్తిగా డౌన్ ఫాల్ అయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు, వాళ్ళలో సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ కూడా ఒకరు అని చెప్పొచ్చు.

కెరీర్ మొదలు పెట్టడం ప్రేమ కావాలి, లవ్ లీ లాంటి సూపర్ హిట్స్ తో మొదలు పెట్టి వరుస పెట్టి ఆఫర్స్ ను సొంతం చేసుకున్న ఆది తర్వాత కెరీర్ లో ఒక్కటంటే ఒక్క హిట్ ను కూడా సొంతం చేసుకోలేదు, ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశనే ఎదురు అయింది.

రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు శశి సినిమాతో వచ్చాడు ఆది, ఈ సినిమా సాంగ్స్ మంచి హిట్ అవ్వడం తో బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా హిట్ అవుతుందని ఆశ పడ్డా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలిచింది…

దాంతో ఆది ఖాతాలో మరో ప్లాఫ్ మూవీ పడినట్లు అయ్యింది, ఇలా కెరీర్ లో ఇన్నేళ్ళుగా అనేక ఫ్లాఫ్స్ తో ఉన్నప్పటికీ కూడా ఆది సాయి కుమార్ వరుస పెట్టి సినిమా అవకాశాలు వస్తూనే ఉండటం విశేషం అనే చెప్పాలి. శశి డిసాస్టర్ తర్వాత కూడా ఆది 3 కొత్త సినిమాలను కమిట్ అవ్వగా వాటితో పాటు శశి సినిమా చేస్తున్న టైం లోనే 2 ప్రాజెక్ట్స్ ని…

ఓకే చేసిన ఆది మొత్తం మీద ఇప్పుడు 5 సినిమాలు చేస్తున్నాడు, చేతినిండా పని ఉంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయితే దక్కడం లేదు ఆదికి, ఇప్పుడు చేస్తున్న 5 సినిమాల్లో ఒకటి పాన్ ఇండియా మూవీ మరోటి బైలింగువల్ మూవీ ఉండటం తో ఒక్కటి సక్సెస్ అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ని సొంతం చేసుకోవచ్చు, మరి ఆది ఏ సినిమాతో కంబ్యాక్ ఇస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here