Home న్యూస్ రీ రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ ఆల్ టైం డిసాస్టర్ మూవీ!!

రీ రిలీజ్ అవుతున్న ఎన్టీఆర్ ఆల్ టైం డిసాస్టర్ మూవీ!!

0

టాలీవుడ్ లో ప్రస్తుతం అన్ సీజన్ నడుస్తుంది. కొత్త సినిమాలు ఏమి రిలీజ్ లేక పోవడంతో థియేటర్ ఫీడింగ్ కోసం ఓల్డ్ మూవీస్ ని రీ రిలీజ్ చేస్తున్నారు, కానీ లాస్ట్ ఇయర్ మొదలైన ఈ ట్రెండ్ లో ఖుషి, ఒక్కడు తర్వాత వచ్చిన ఏ సినిమా కూడా అనుకున్న రేంజ్ లో అయితే పెర్ఫార్మ్ చేయలేదు అనే చెప్పాలి. హిట్ మూవీస్ నే ఆడియన్స్ పెద్దగా పట్టించు కోవడం లేదంటే…

AP-TG 9th Day Highest Share Movies

ఇప్పుడు అందరినీ ఆశ్యర్య పరుస్తూ ఏకంగా ఆల్ టైం డిసాస్టర్ అయిన సినిమాను రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉండటం అందరినీ ఆశ్యర్యపరుస్తుంది. ఆ సినిమానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఆంధ్రావాలా సినిమా… ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ 2004 టైంలో రిలీజ్ అయినప్పుడు…

సినిమా మీద ఉన్న అంచనాలు అన్నీ ఇన్ని కావు, సింహాద్రి లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత సెన్సేషనల్ క్రేజ్ నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యి ఏకంగా ఆల్ టైం డిసాస్టర్ రిజల్ట్ ను…

బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. అలాంటి రిజల్ట్ ను తెచ్చుకున్న ఈ సినిమాను ఇప్పుడు ఈ నెలలోనే రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తూ అఫీషియల్ పోస్టర్స్ ను కూడా రిలీజ్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో పోయి పోయి ఈ సినిమానే దొరికిందా అంటూ ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here