Home గాసిప్స్ చేతులు మారిన క్రేజీ ప్రాజెక్ట్….తెరవెనుక కారణం ఇదే!!

చేతులు మారిన క్రేజీ ప్రాజెక్ట్….తెరవెనుక కారణం ఇదే!!

0

ముందు ఒకరితో అనుకున్న సినిమా తర్వాత కొన్ని అనుకోని కారణాల వలన మరొకరితో చేయడం అన్నది సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. లేటెస్ట్ గా ఇలాంటిదే మరో ఇంసిడెంట్ టాలీవుడ్ లో జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఒప్పుకున్న ప్రాజెక్ట్ లు మారుతూ వస్తుండగా ఆ ఇంపాక్ట్ అప్ కమింగ్ మూవీస్ మీద పడుతుంది. ముందు త్రివిక్రమ్ తో ఉండాల్సిన సినిమా పోస్ట్ పోన్ అవ్వగా…

Top 10 Telugu Trailer Records In 24 Hrs

కొరటాల శివతో సినిమా ఓకే అయినా ఇప్పటికీ పట్టాలు ఎక్కలేదు, ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా కమిట్ అవ్వగా వాటి తర్వాత ఉప్పెన ఫేం బుచ్చిబాబు సనా డైరెక్షన్ లో ఒక స్పోర్ట్స్ డ్రామా కి కమిట్ అయ్యాడు ఎన్టీఆర్…

కొరటాల సినిమా లేట్ అవుతూ ఉండటంతో ముందు బుచ్చిబాబుతో సినిమా చేద్దాం అనుకున్నా కానీ కొరటాల ఫైనల్ నరేషన్ ఇవ్వడంతో ఇక డేట్స్ అడ్జెస్ట్ చేయడం కష్టం అవ్వడం, ఉప్పెన తర్వాత పూర్తీ టైం ఈ సినిమా స్క్రిప్ట్ పైనే బుచ్చిబాబు పెట్టడంతో ఇక తప్పక సినిమా చేతులు మారక తప్పలేదు…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శంకర్ తో సినిమా తర్వాత గౌతమ్ తిన్ననూరు డైరెక్షన్ లో సినిమా చేయాల్సి ఉన్నా ఆ సినిమా ఆగిపోగా ఇప్పుడు వీళ్ళ ప్రాజెక్ట్ ను అఫీషియల్ గా కన్ఫాం చేశారు. కాగా రామ్ చరణ్ ఎన్టీఆర్ కలిసి ఈ సినిమా గురించి మాట్లాడుకుని నిర్ణయం తీసుకున్నారని ప్రజెంట్ టాలీవుడ్ టాక్. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here