Home గాసిప్స్ బాలయ్య కెరీర్ లో రికార్డ్….240 తో ఊచకోత

బాలయ్య కెరీర్ లో రికార్డ్….240 తో ఊచకోత

0

  నట సింహం నందమూరి బాలకృష్ణ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో గౌతమీపుత్ర శాతకర్ణి తర్వాత వస్తున్న సినిమా ఎన్టీఆర్ బయోపిక్ సంక్రాంతి కి భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న మొదటి పార్ట్ ఎన్టీఆర్ కథానాయకుడు ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు మరింతగా పెరిగి పోయాయి. దాంతో సినిమా కోసం టోటల్ టాలివుడ్ ఆశగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు సినిమా ఓవర్సీస్ లోకేషన్స్ కౌంట్ కూడా భారీ గా ఉండబోతుంది అని తెలుస్తుంది.

కాగా ఓవర్సీస్ లో బాలయ్య కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ లెవల్ లో ఏకంగా 240 కి పైగా లోకేషన్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఇది వరకు వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి సుమారు 140 వరకు లోకేషన్స్ లో అక్కడ రిలీజ్ అయింది.

ఇప్పుడు భారీ క్రేజ్ నడుమ వస్తున్న ఈ సినిమా 240 లోకేషన్స్ లో రిలీజ్ అంటే ఏమాత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ లో కేలేక్షన్స్ ఊచకోత ఖాయమని చెప్పొచ్చు. మరి సినిమా అక్కడ కూడా ఎలాంటి సెన్సేషనల్ రికార్డులను అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here