అమ్మింది 45 కోట్లకి…3 రోజుల్లో వచ్చింది ఇది

0
432

  కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన లేటెస్ట్ మూవీ KGF బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని పూర్తీ చేసుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ లో చూపిన గ్రోత్ అల్టిమేట్ అనే చెప్పాలి. కన్నడ లోనే కాకుండా తెలుగు తమిళ్ హిందీ భాషల్లో కూడా సినిమా అల్టిమేట్ లెవల్ లో ట్రెండ్ అయ్యి బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో ఏలి వీకెండ్ ముగిసే సమయానికి చాలా వరకు…

ప్రీ రిలీజ్ బిజినెస్ ని వెనక్కి తెచ్చి సంచలనం సృష్టించింది. సినిమా మొదటి వీకెండ్ టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని పరిశీలిస్తే…కర్ణాటక లో 37 కోట్ల గ్రాస్ ని, తెలుగు లో 5 కోట్లు, కేరళలో 80 లక్షలు, తమిళ్ లో 2.6 కోట్లు మరియు హిందీలో 12 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయగా…

ఇండియా మొత్తం మీద సినిమా 57.4 కోట్ల గ్రాస్ ని అందుకోగా టోటల్ ఓవర్సీస్ లో 2.7 కోట్ల గ్రాస్ ని అందుకుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 60.1 కోట్ల గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని దుమ్ము లేపగా షేర్ మొత్తం మీద 31 కోట్ల రేంజ్ లో ఉన్నట్లు సమాచారం. బ్రేక్ ఈవెన్ కి సినిమా మరో 15 కోట్లు వసూల్ చేస్తే సరిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here