ఎన్టీఆర్ కథానాయకుడు సెన్సార్ రిపోర్ట్!

0
346

నట సింహం నందమూరి బాలక్రిష్ణ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున సంక్రాంతి బరిలో మరి కొన్ని రోజుల్లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది, కాగా సినిమా రీసెంట్ గా సెన్సార్ పనులను పూర్తి చేసుకుని ఎలాంటి అడ్డంకులు లేకుండా భారీ ఎత్తున వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుండగా. సినిమా సెన్సార్ తర్వాత క్లీన్ యు సర్టిఫికెట్ ని సొంతం చేసుకుంది.

ఇక సినిమా ఓవరాల్ రన్ టైం ఏకంగా రెండు గంటల 30 నిమిషాల రేంజ్ లో ఉందని సమాచారం. సినిమా కి యూనిట్ వర్గాలు ప్రశంసలు దక్కాయట. బాలయ్య నటన అదిరి పోయే సెకెండ్ ఆఫ్ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్ గా వారు చెప్పుకుంటున్నారు.

NTR Kathanayakudu Censor Details

ముఖ్యంగా క్లైమాక్స్ ఎపిసోడ్ రెండో పార్ట్ పై అంచనాలు పీక్స్ లో పెరిగేలా చేస్తుందని, ఆ బ్లాక్ ఇచ్చే కిక్ అంతా ఇంతా కాదని అంటున్నారు. దాంతో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇదే రేంజ్ టాక్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ రికార్డుల వర్షం కురిపించడం ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!